తెలంగాణ

తెలంగాణ భవన్‌లో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: విడిపి అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో దేశంలోని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొదటి స్థానంలో నిలవడంపై టిఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్‌లో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పడితే చీకటి మయం అవుతుందని, మత కలహాలు చెలరేగిపోతాయని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని ప్రచారం చేసిన నాయకులు ఈరోజు కెసిఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇస్తున్న దాన్ని కళ్లతో చూస్తున్నారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం, తెలంగాణలో వెల్లివిరుస్తున్న సామరస్యం చూసి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ముందు జాగ్రత్తగా మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీస్తే, ఇప్పుడు వరుణుడి కరుణతో భారీ వర్షాలు కురిసి చెరువులు నిండాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనం పల్లి హనుమంతరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్‌కు తరలి వచ్చారు. కెసిఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. స్వీట్లు పంచారు. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బడుగు బలహీన వర్గాలను సంతృప్తిపరిచారని, మరో పక్క మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో దేశంలోనే వినూత్న తరహాలో పాలన సాగిస్తున్నారని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, గ్రేటర్ కో ఆర్డినేటర్ పుటం పురుషోత్తమ రావు ఇతర నాయకులు పాల్గొన్నారు.