తెలంగాణ

ఏడాదికి వెయ్యి కోట్లు నష్టం... చత్తీస్‌గఢ్‌తో పిపిఎ వద్దే వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజనాపై సాలీనా రూ.1050 కోట్ల భారం పడుతుందని, పిపిఏకు వెళ్లే ముందు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో సవరణలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ పి రఘు విద్యుత్ నియంత్రణ మండలిని కోరారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఆర్ధిక ఇక్కట్లు కలగకుండా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ జాక్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. గురువారం ఇక్కడ సింగరేణి భవన్‌లో చత్తీస్‌గడ్ రాష్ట్రంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని తెలంగాణ డిస్కాంలు ప్రతిపాదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై టిఎస్‌ఇఆర్‌సి బహిరంగ విచారణ నిర్వహించింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, టిపిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య టిఎస్‌ఇఆర్‌సికి వినతిపత్రం ఇచ్చారు. ఈ పిపిఏ మూడు సంవత్సరాల తర్వాత అమలు చేస్తారని, మొత్తం 12 సంవత్సరాలపాటు చట్టబద్ధత ఉంటుందని, రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. దాదాపు 12 సంవత్సరాలకు రాష్ట్రంపై 12,000 కోట్ల భారం పడుతుందన్నారు. 2018 నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్ సాధిస్తుందని చెబుతున్న కెసిఆర్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రం నుంచి అదనపు విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేస్తోందన్నారు.
రాష్ట్రప్రభుత్వం 2018 నాటికి విద్యుత్ వ్యవస్ధాపిత సామర్థ్యం 23,675 మెగావాట్లకు పెరుగుతుందని ప్రతిపాదించిందన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ రావాలంటే వార్దా-మహేశ్వరం, అంగూరు- పలాసా విద్యుత్ పంపిణీ లైన్లు నిర్మాణం కావాల్సి ఉందని, వీటిపై స్పష్టత లేదన్నారు.తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ పి రఘు మాట్లాడుతూ, సాలీనా 700 కోట్ల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ఖజనాపై వచ్చే 12 సంవత్సరాలపాటు మొత్తం రూ.12,600 కోట్ల భారం పడుతుందన్నారు. వినియోగదారులు సాలీనా రూ.1050 కోట్ల భారం మోయాల్సి ఉంటుందన్నారు.
కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు డిస్కాంలు వెళ్లే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. చత్తీస్‌గఢ్ డిస్కాంలకు అనుకూలంగా పిపిఏ ఉందన్నారు. తెలంగాణ జాక్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వాలు కోట్లు వెచ్చించి చేసుకునే ఒప్పందాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించి లోటుపాట్లను సరిచేయాలన్నారు. సిపిఐ రాష్ట్ర నేత వి రామనర్సింహారావు మాట్లాడుతూ పిపిఏ రూపకల్పనలో పారదర్శకత ఉండాలన్నారు.