తెలంగాణ

రైతులను విస్మరిస్తున్న మోదీ, కెసిఆర్ ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, అక్టోబర్ 29 : కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ వారి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఎఐసిసి కార్యదర్శి, ఎంపి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా అన్నారు. శనివారం రాత్రి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టిపిసిసి చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస రైతు గర్జనలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఏక కాలంలో 80 లక్షల మంది రైతుల రుణాలను మాపీ చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ్ నేతృత్వంలో జరుగుతున్న రైతు, విద్యార్థి ఉద్యమాలు సఫలీకృతమవుతున్నా యని, దీనికి ఎఐసిసి మద్దతు ప్రకటించిందని అన్నారు. విద్యార్థుల బలిదానాలు, ఆందోళనతో చలించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పా టుకు కృషి చేశారని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా వారిపైనే లాఠీలు ప్రయోగిస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి, నిజాయితీ, కమిట్‌మెంటు ఉన్న వ్యక్తి కావటం వల్లే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సోనియాగాందీ, రాహుల్ గాంధీ పిసిసి పగ్గాలు అప్పగించారని, ఆయన నాయకత్వంలో 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కుంతియా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 37 లక్షల మంది రైతుల రుణాలు 3 లక్షల మంది మహిళా రైతుల రుణాలు, 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయంమర్సుమెంట్ బకాయిలు ప్రభుత్వం ఏక కాలంలో విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే, టిపిసిసి చీఫ్ కెప్టెన్‌ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ నియోజకవర్గ రైతు గర్జనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధానమైన డిమాండ్లతో పోరాడుతున్నదని, రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయంబర్సుమెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు. ఈ సంవత్సరం నీటి పారుదల కాంట్రాక్టర్లకు 20 వేల కోట్ల రూపాయలు చెల్లించి ఇంకా 10 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం రైతుల 6 వేల కోట్ల రుణాలు, విద్యార్థులు ఫీజు బకాయిలు 3100 కోట్లు చెల్లించలేదా అని ప్రశ్నించారు. రైతుల రుణాలు చెల్లించక పోవడం వల్ల బ్యాంకులు రైతులకు అప్పులు ఇవ్వడం లేదని అనావృష్టి, అతివృష్టి వల్ల వ్యవసాయ సంక్షోభంలో పడిందని 2014లో 107 టన్నులు ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాలు 2016లో 49 లక్షలకు పడిపోయిందని అన్నా రు. ఈ సభలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌యాదవ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, సర్పంచ్‌లు, పిఏసిఎస్ చైర్మన్‌లు పాల్గొన్నారు.
chitram....
హుజూర్‌నగర్‌లో శనివారం రాత్రి జరిగిన రైతు గర్జనలో ప్రసంగిస్తున్న ఎఐసిసి కార్యదర్శి,
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్జి ఆర్‌సి కుంతియా. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ రైతు గర్జన ర్యాలీ