తెలంగాణ

బావురుమంటున్న బోనకల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 31: నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇటీవలి మలిదశ ఉద్యమం వరకు ప్రజల్ని చైతన్యపర్చి ఉద్యమబాట పట్టించడంలో ఇక్కడి ప్రజలదే ముందుబాట. కానీ నేడు డెంగ్యూ జ్వరాలతో బాధితులు పిట్టల్లా రాలిపోతుంటే మిగిలిన వారు వలసబాట పడుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం నెలరోజులుగా డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతోంది. నెలరోజుల్లో 22 మంది డెంగ్యూతో మృతి చెందారంటే పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థవౌతుంది. ఒక్క రావినూతల గ్రామంలోనే ఇప్పటివరకు 8మంది మృతిచెందారు. మండలం మొత్తమీద మృతులతో పాటు జ్వరపీడితుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన కానరావడం లేదు. జిల్లా కేంద్రం ఖమ్మంకు కేవలం 28కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మండలంలో గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలు ప్రమాదకర డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు. బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటికి సుమారు 4వేల మంది జ్వరాలతో చికిత్స పొందగా అందులో 90శాతం మందికి పైగా మలేరియా, డెంగ్యూ జ్వరపీడితులే. కాగా ఇప్పటివరకు 18,016 మంది బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే అంతుచిక్కని జ్వరాలతో బాధపడుతున్న 786మంది రక్తనమూనాలు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి పంపగా అందులో 312 డెంగ్యూ పాజిటివ్ కేసులని తేల్చారు. ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్సలు సరిగ్గా అందడం లేదంటూ అనేక మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసినా జ్వరం మాత్రం తగ్గకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే, మరణించిన 22మందిలో ఎక్కువ మంది తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తగ్గకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినవారే కావడం గమనార్హం. రోజురోజుకూ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు వలసబాట పడుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాల్లోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. రావినూతల గ్రామంలో ఇప్పటికే 8 మంది మరణించగా, సుమారు 100 మందికి పైగా ఇంకా డెంగ్యూతో బాధపడుతుండటంతో ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేవారి సంఖ్య పెరిగిపోతోంది.
రావినూతల గ్రామంలో కొండా నాగేశ్వరరావు, అజ్మిరా సుజాత, గుగులోతు సైదులు, బానోతు మంగతాయి, పోలెబోయిన సాయిసుధ , అజ్మిరా రఘుపతి, వెంకటనారాయణ, చిరునోములలో గర్నెపూడి సుగుణమ్మ, బోయిన వెంకటరత్నం, బోనకల్‌లో అనె్నపోగు నాగరాజు, జానమ్మ (తల్లి, కుమారుడు), మరీదు వెంకట్రాములు, గోవిందాపురంలో ఏసుపోగు వెంకటేశ్వర్లు, పెద్దబీరవల్లిలో జూపుడి బాబు, బ్రాహ్మణపల్లిలో చేపూరి ఎలెస్టీన్, చోప్పకట్లపాలెంలో సుంకర మహలక్ష్మి, ముష్టికుంట్ల కొప్పుల నాగరత్నం, బోనకల్‌లో యాచకుడు వజ్రాతి శివారెడ్డి, మర్రి ఆదిలక్ష్మి, గార్లపాడులో కట్ల సరస్వతి మృతి చెందారు. కాగా, మండలంలో జ్వర పీడితులు అధికంగా ఉన్న గ్రామాల్లో జిల్లా, రాష్ట్ర వైద్య బృందాలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు పర్యటించి పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలు అప్రమత్తం కావాలి
రాష్ట్రంలో చూస్తే బోనకల్ మండలంలోనే డెంగ్యూ జ్వరాల కేసులు అధికంగా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ శంకర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తమై అధికారుల సూచనలు పాటిస్తే జ్వరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందన్నారు. డెంగ్యూ గురించి ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పటివరకు మృతి చెందిన వారంతా ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందినవారని ఆయనన్నారు.

జ్వరాలతో వైద్య చికిత్స పొందుతున్న పిల్లలు