రాష్ట్రీయం

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 31 : ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాస ప్రారంభం రోజు, శివునికి ప్రీతికరమైన సోమవారం కావడంతో వేకువజాము నుంచే అధిక సంఖ్యలో మహిళలు పాతాళగంగలో పుణ్యస్నానమాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం పురస్కరించుకుని భక్తుల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే రద్దీ రోజులైన ఆది, సోమవారాలు, పర్వదినాలు, సెలవురోజుల్లో ఆలయ వేళల్లో మార్పులు చేశారు. ఆయా రద్దీ రోజుల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలకు 1500 టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ఇఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు.