తెలంగాణ

అవినీతిలో నెంబర్1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ‘నిజమే, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అవినీతి, అక్రమాల్లో దేశంలో నెంబర్-1గా నిలిచారు..’ అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఏమి చేశారని దేశంలో కెసిఆర్ నెంబర్-1 అయ్యారని ఆయన సోమవారం పార్టీ నాయకులు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కి, జగ్గారెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. బూటకపు సర్వేలతో కెసిఆర్ తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తీవ్రమైన నిరాశ, నిస్పృహతో ఉన్నారని, ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేనప్పుడు ముఖ్యమంత్రి పాపులర్ ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చేశారా? రెండు పడకల గదుల ఇళ్లు కట్టించి ఇచ్చారా? దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారా?, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించారా? అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇలాఉండగా అంతకుముందు గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా చిత్ర పటాలకు పూలదండ వేసి ఉత్తమ్‌తో పాటు పార్టీ నాయకులు వారి సేవలను కొనియాడారు.