తెలంగాణ

సింహబలం కాదు.. కోతిబలమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 31: కెసిఆర్‌ది కోతిబలమని పిచ్చికోతి చెట్టెక్కి కల్లు తాగితే అదే తన సొంత బలమని భావిస్తుందని.. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా కోతిబలం మాదిరే వ్యవహరిస్తున్నారని.. ఆయనది సింహబలం కానేకాదని తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం చేపట్టిన పాదయాత్రకు టిటిడిపి మద్దతు ప్రకటించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిర్వహిస్తున్న పాదయాత్రలో రేవంత్‌రెడ్డితో పాటు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, సతీష్‌మాదిగ తదితర టిడిపి నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తిమ్మాజీపేటలో ఏర్పాటుచేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విధానాల పట్ల అసమానతలు పెరుగుతన్నాయని ప్రజల మధ్య తగాదాలు ముదిరిపోతున్నాయని అట్టడుగు వర్గాల ప్రజలకు పథకాలు అందడం లేదని ఆరోపించారు. నోరెత్తి ప్రతిపక్షాలు గర్జిస్తే ఆలాంటి గొంతులను కెసిఆర్ నొక్కి చంపుతున్నారని ఆరోపించారు. 150 గదులతో విశాలమైన సెక్రటేరియట్ నిర్మించుకోవడానికి కెసిఆర్ సన్నద్ధం అవుతున్నారని.. కానీ పేదలకు మాత్రం డబుల్ బెడ్‌రూంలు నిర్మించడానికి మనస్సు రావడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఏ రాజకీయ పార్టీ అయిన పోరాటలు ఉద్యమాలు చేస్తే ఆయా పార్టీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం మహజన పాదయాత్రలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఎం చేపట్టిన పాదయాత్రను కెసిఆర్ తప్పుపట్టడం.. మూర్ఖత్వమని, రెండున్నర ఏళ్ల కెసిఆర్ అసమర్థపాలన, డొల్లతనం ప్రజల్లోకి ప్రతిపక్షాలు తీసుకెళ్తే ప్రజలు తిరగబడతారనే భయంతో ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కెసిఆర్ నిజంగానే బలవంతుడు అయితే ఆయన నేరుగా తండాలు, గుడెంలలో పర్యటించాలని, దమ్ముంటే దళితవాడల్లో డబుల్ బెడ్‌రూం గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

సిపిఎం నేత తమ్మినేని వీరభద్రంతో కలిసి పాదయాత్ర చేస్తున్న రేవంత్‌రెడ్డి