తెలంగాణ

డెంగ్యూ పీడిత ప్రాంతాలకు తక్షణమే వైద్య బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందడంతో వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సచివాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యాధి ఉందని, ఖమ్మంలో జిల్లాలోని బోనకల్, రావి నూతనల, గోవిందపురం గ్రామాల్లో ఎక్కువగా ఉన్నందున ఆ గ్రామాలకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించారు. దీంతో జెడి నాయకత్వంలో వైద్య బృందం ఆ గ్రామాలకు వెళ్లింది. పరీక్షా పరికరాలతో పాటు వైద్య సిబ్బందిని పంపించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి అందిరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాలకు సెల్ కౌంట్ మిషన్లు పంపించారు. డెంగ్యూ దోమల నివారణకు ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలోని అన్ని స్ప్రెలు బోనకల్‌కు తరలించాలని ఆదేశించారు. వారానికి రెండుసార్లు బాధితుల ఇళ్లలో స్ప్రై చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రం నుంచి వైద్యుల బృందాన్ని పంపించనున్నారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపడంతో పాటు సీరియస్‌గా ఉన్న కేసులను ఖమ్మంకు, అంత కన్నా సీరియస్ అయితే హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించారు. డెంగ్యూ వ్యాప్తి చెందిన ప్రతి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి నుంచి బోనకల్‌కు ప్రత్యేక బృందం వెళ్లింది. గ్రామానికి ఒకటి చొప్పున 108 వాహనాలను తరలించారు. మూడు 104 వాహనాలను కూడా పంపాలని నిర్ణయించారు. పంచాయితీరాజ్, మంచినీటి సరఫరా తదితర విభాగాల అధికారులతో మాట్లిడి ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచంచారు.

సచివాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన మంత్రి లక్ష్మారెడ్డి