ఆంధ్రప్రదేశ్‌

టెన్త్ షెడ్యూలు సంస్థల విభజన ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: పదో షెడ్యూలులో ఉన్న సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అడ్డం పడుతోందని, వెంటనే విభజనకు సహకరించాలని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. నిజాం రాజు నిర్మించిన భవనాలపై తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఆంధ్రప్రదేశ్‌కూ అంతే హక్కు ఉందని పేర్కొన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో భవనాలు, ఆర్టీసీ భవన్, పర్యావరణ భవన్ వంటి చాలా భవనాలను చంద్రబాబు పాలనలో నిర్మించినవేనని, రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు లేకుండా చూడాలని ఆంధ్రా భావిస్తుంటే తెలంగాణ మాత్రం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో 175 సంస్థలు కాకుండా ఈ రెండింటి పరిధిలోకి రానివి మరో 37 సంస్థలు ఉన్నాయని వాటన్నింటినీ కలుపుకుంటే 216 సంస్థలు అవుతాయని, వీటిపై కెసిఆర్ ఎందుకు మాట్లాడటం లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రశ్నించారు. ఉద్యోగుల విభజనపై కమల్‌నాధన్ కమిటీని వేస్తే దానికి సహకరించడం లేదని, ఉమ్మడి సంస్థల విభజనపై కేంద్రం షీలాబేడీ కమిటీని వేస్తే దానిని కూడా పక్కన పెట్టారని, సదరన్ రీజియన్ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశానికి కేంద్రం తరపున ఇంధన శాఖ కార్యదర్శి హాజరయ్యారని, ఎపి నుండి సిఎండిలు హాజరైతే తెలంగాణ తరపున సిఇలను పంపించారని గుర్తుచేశారు. ఎపి ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు 4262 కోట్లు బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ముందుకు రావడం లేదని, అదే సింగరేణికి ఎపి బకాయిలు 2200 కోట్ల గురించి మాట్లాడుతున్నారని ఇదేం పద్ధతి అని నిలదీశారు.
పోలీసులు అప్రమత్తం
మావోయిస్టు బంద్‌కు హై అలర్ట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 31: ఈ నెల 3న మావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి ఎన్ సాంబశివరావు ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన జిల్లా ఎస్పీలను ఆదేశించారు. స్థానికంగా ఉండే సమస్యలపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో శాంతిభత్రల డిజి ఆర్‌పి ఠాకూర్, విజయవాడ కమిషనర్ గౌతం సవాంగ్ పాల్గొన్నారు.
కానిస్టేబుళ్ల నియామకానికి ముగిసిన గడువు
కానిస్టేబుళ్ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసింది. 7నుంచి అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలనతోపాటు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బర్టు చైర్మన్ అతుల్ సింగ్ తెలిపారు. ఈ పరీక్షలు 6వ, బెటాలియన్ ఏపిఎస్పీ, మంగళగిరిలో జరుగుతాయ. హాల్ టికెట్లను ళషూఖజఆౄళశఆ.్ఘఔఔ్యజషళ.్య్ప.జశలో ఢౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విదేశీ కంపెనీలకు వేల కోట్లు ధారాదత్తం: వైకాపా

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 31: రాజధాని నిర్మాణం పేరిట విదేశీ కంపెనీలకు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. విదేశీ కంపెనీలకు వేల కోట్లు కట్టబెడుతూ సింగపూర్, న్యూయార్క్ వచ్చేస్తున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. స్విస్‌చాలెంజ్ విధానంపై హైకోర్టు తప్పుపట్టిందని ఆయన తెలిపారు. కోర్టులు తప్పుపట్టిన సందర్భాల్లో నీలం సంజీవరెడ్డి, ఎన్. జనార్దన్‌రెడ్డి ప్రభృతులు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోర్టులపై గౌరవం ఉంటే, నైతిక విలువలు పాటించే వ్యక్తి అయితే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.