ఆంధ్రప్రదేశ్‌

నోట్లో ఎండ్రిన్ పోసి.. ఒంటికి నిప్పంటించి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, అక్టోబర్ 31: మానవత్వం మంటగలిసింది. ఓ గృహిణి తన భర్తను కొడుకు, కోడలితో కలిసి అమానవీయంగా కడతేర్చింది. భర్త నోటిలో ఎండ్రిన్, ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఆ కుటుంబానికి పెద్దగా వ్యవహరించిన అతను కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో సోమవారం జరిగింది. యాకమూరులో శొంఠి ఏడుకొండలు (47)కి భార్య వీరకుమారి, కొడుకు వీరబాబు ఉన్నారు. ఏడుకొండలు వ్యవసాయపనులు చేస్తూ సంపాదించేవాడు. కొంతకాలం క్రితం ఏడుకొండలుకి మానసిక సమస్య ఎదురైంది. అప్పటినుంచి సక్రమంగా పనికి వెళ్లలేకపోతున్నాడు. అతని వైద్యానికి ఖర్చు పెరుగుతుండటంతో భార్య, కొడుకు అతడి పట్ల ఉదాసీనంగా ఉంటూ వచ్చారు. వారం క్రితం కొడుకు వీరబాబు ఇనుప రాడ్‌తో తండ్రిని విచక్షణారహితంగా కాళ్లపై కొట్టి ఇంటినుంచి గెంటేశాడు. ఏడుకొండలు నడవలేని స్థితిలో పాక్కుంటూ అంకమ్మతల్లి గుడివద్దకు చేరాడు. ఏడుకొండలు బంధువులు గ్రామ సర్పంచ్ గాదె కనకదుర్గకి సమస్యను వివరించారు. దీంతో ఏడుకొండలు భార్య, కొడుకుని పిలిపించి, ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించి చక్కగా చూసుకోవాలని సర్పంచ్ హెచ్చరించారు. సోమవారం అంకమ్మతల్లి గుడి దగ్గరున్న ఏడుకొండలుని ఇంటికి తీసుకెళ్లిన భార్య, కొడుకులు మధ్యాహ్నం 12.30 గంటలకు దారుణంగా కొట్టి ఇంటి నుంచి బయటకు పడదోశారు. నోట్లో ఎండ్రిన్, పురుగుల మందు పోసి, ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ దురాగతాన్ని ఏడుకొండలు అన్నయ్య వీర సత్యనారాయణ చూసి మంటలను ఆర్పాడు. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన చుట్టుపక్కల వారిపై కూడా వీరకుమారి, వీరబాబు దాడి చేయటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో వీరకుమారి, కొడుకు, కోడలు ఇంట్లోనే వుండి గడియ పెట్టుకున్నారు. పోలీసులు వచ్చిన అనంతరం వారు తలుపులు తెరిచారు. స్థానికుల సహాయంతో కాలిన గాయాలతో ఉన్న ఏడుకొండలుని అతని సోదరుడు అంబులెన్స్‌లో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం తెలుసుకున్న ఏసిపి విజయభాస్కర్, సిఐ సత్యనారాయణ, పమిడిముక్కల ఎస్‌ఐ రమేష్‌కుమార్ యాకమూరు వచ్చి ఏడుకొండలు ఇంటిని పరిశీలించారు. వీరకుమారి, కొడుకు, కోడలిని పోలీసులు అదుపులోకి తీసుకుని తోట్లవల్లూరు పిఎస్‌కు తరలించారు.

కాలిన గాయాలతో చనిపోయిన ఏడుకొండలు