ఆంధ్రప్రదేశ్‌

మారిన బాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పు ఆశిస్తున్న పార్టీ శ్రేణులకు శుభవార్త. ప్రతిరోజూ గంటలకు గంటల టెలీకాన్ఫరెన్సులు, సమీక్ష సమావేశాలతో విసిగి వేసారిపోతున్న అధికారులకు ఊరట. ఇకపై తాను పార్టీకి పూర్తిస్థాయి సమయం కేటాయిస్తానని, సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్ విధానాల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు బాబు స్వయంగా ప్రకటించారు. సోమవారం విజయవాడలో నీరు-మట్టి పథకంపై సమీక్ష సందర్భంగా బాబు తన భవిష్యత్తు ప్రణాళికలతో పాటు, తాను మారుతున్నానన్న సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయమే గంటల పాటు అధికారులతో జరుగుతున్న టెలీకాన్ఫరెన్సు విధానానికి తెరదించి దాన్ని ప్రతి 15రోజులకు మార్చారు. వివిధ శాఖలపై జరుగుతున్న సమీక్ష సమావేశాలకు నిర్దిష్ట కాలవ్యవధి లేకుండా పోతుండటంతో రోజూ లెక్కలేనన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇకపై దాన్ని కూడా నెలకు ఒకసారికి కుదించనున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలోని తన నివాసంలోనో, విజయవాడ క్యాంపు ఆఫీసులోనో ప్రజాప్రతినిధులు, నేతలను సమీక్ష సమయం మధ్య దొరికే విరామంలోనో కలుస్తున్నారు. అదికూడా వారికి ఒకటి, రెండు నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నా నిర్దిష్ట హామీలు ఇవ్వలేకపోతున్నారు. వాళ్లలో అసంతృప్తిని తొలగిస్తూ ఇకపై తన నివాసంలోనే సాయంత్రం మూడు గంటలపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు ప్రత్యేకంగా సమయం కేటాయించేందుకు నిర్ణయించారు. ఇలాంటి నిర్ణయాల కోసం పార్టీ నేతలు, అధికారులు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. జిల్లాస్థాయి పార్టీ వ్యవహారాలు మాట్లాడాలన్నా బాబు సమయం ఇవ్వకపోవడంతో మంత్రులు సైతం నిరాశగా వెనుదిరిగిన సందర్భాలు బోలెడు. అన్ని అంశాలకు ‘చూద్దాం’, ‘మాటాడదాం’, ‘వర్కవుట్ చేద్దామ’న్న మాటలే తప్ప ఆ సమస్య విని దాన్ని అక్కడికక్కడ పరిష్కరించే విధానం లేకపోవటం ఇబ్బందిగా మారింది.
తాను ప్రభుత్వానికి పరిమితం కావడం వల్ల పార్టీ నష్టపోతోందని, జిల్లా నేతల కుమ్ములాటలు పెరుగుతున్నాయని, కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందంటూ తనకు వచ్చిన నివేదికల ఆధారంగా చేసిన కసరత్తు ఫలితమే ఈ నిర్ణయాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా జగన్ పెరగడం లేదన్న ధీమా పనికిరాదన్న వాస్తవాన్ని బాబు రెండున్నరేళ్ల తర్వాత గ్రహించి పార్టీపై దృష్టి పెట్టాలని నిర్ణయించడం మంచి పరిణామమంటున్నారు.
బాబు తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గంటల కొద్దీ కొనసాగుతోన్న మంత్రివర్గ సమావేశాల సమయాన్ని కూడా కుదించాలని మంత్రులు భావిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ సమావేశాలే రెండు గంటలకు మించవని, చాలా రాష్ట్రాల్లో కూడా గంటలోపే ముగుస్తాయని ఉదహరిస్తున్నారు.
సీఎంఓ ప్రక్షాళన మాటేమిటి?
పార్టీపై దృష్టి సారించిన బాబు సీఎంఓనూ ప్రక్షాళన చేయాలని మెజారిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అధికారులలో ఒకరు, పీఏ, పీఎస్‌లు తప్ప మిగిలిన వారంతా తమ సమస్యలపై స్పందించడం లేదని, పీఏ, పిఎస్‌లు పదేళ్ల నుంచి బాబుతో ఉన్నందున వారితో సులభంగా మాట్లాడగలుగుతున్నామని, వారు కూడా మునుపటి మాదిరిగానే ఉంటున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో సీనియర్లు చెప్పిన పనులు కూడా కావడం లేదంటున్నారు.