తెలంగాణ

వినికిడి-మాట లోపం ఉన్న వారికి మన టీవీలో పోటీ పరీక్షల శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే మాట- వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ ఆధ్యర్యంలోని ‘మనటీవీ’ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సిఇఓ ఆర్ శైలేష్‌రెడ్డి చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బుధవారం నాడు సూచనలు-సలహాలు ప్రసారం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మాట వినికిడి లోపం ఉన్న వారికి కూడా అవగాహన కార్యక్రమం ప్రసారం చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రూప్-2 పరీక్ష కోసం నిర్వహించే నాలుగు పేపర్లపైనా సమాచారం ఇస్తామని వెల్లడించారు. మన టీవీ గ్రూప్-2 ప్రసారాల్లో భాగంగా ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటిగంట వరకూ 1948నాటికి ముందున్న తెలంగాణ చరిత్రను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. కవి, చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఈ అంశాన్ని వివరిస్తారని ఆయన చెప్పారు.
సంతానసాఫల్య పరీక్షలపై సదస్సు
న్యాయపర అంశాలపై సమీక్ష
నైతిక విలువలు, నిబంధనలపై చర్చ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 31: సంతాన సాఫల్య కేంద్రాల నిర్వహణలో నైతిక విలువలు, నియమనిబంధనలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అనే అంశాలపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు మెటర్నల్ హెల్త్ రీసెర్చి ట్రస్టు డైరెక్టర్ డాక్టర్ రోయా రోజట్టి తెలిపారు. ఈ సదస్సు నవంబర్ 5 నుండి రేడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో జరుగుతుందని, ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి హాజరవుతారని, గౌరవ అతిథిగా హెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి జనార్ధనరెడ్డి హాజరవుతారని తెలిపారు. సదస్సులో ఉస్మానియా యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, ఐసిఒజి కార్యదర్శి డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సిహెచ్ వెంకటరమణాదేవి పాల్గొంటారని డాక్టర్ రోయా తెలిపారు.
నియోజకవర్గాల నిధులపై
మార్గదర్శకాలు జారీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 31: శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల వినియోగంపై ప్రభుత్వం తాజాగా మెమో జారీ చేసింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బిపి ఆచార్య పేరుతో సోమవారం మెమో జారీ అయింది. ఒక శాసనసభ నియోజకవర్గం రెండు, లేదా మూడు జిల్లాల్లో విస్తరించి ఉంటే, ఆయా జిల్లాల కలెక్టర్లే ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు పనులకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఏవైనా పనులు జరిగి, నిధులు విడుదల చేయని పక్షంలో సంబంధిత నిధులను పాత జిల్లాల కలెక్టర్లు, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే నిధుల వినియోగం జరగాలని ఆచార్య స్పష్టం చేశారు.