రాష్ట్రీయం

పిచ్చుక మీద బ్రహ్మాస్తమ్రా? హోం గార్డులపై చర్యలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా హోం గార్డులపై చర్యలు తీసుకోవటం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. హోం గార్డులు పోలీసులతో సమానంగా పూర్తికాలం విధులు నిర్వహిస్తున్నప్పటికీ నెలసరి వేతనం కాకుండా దినసరి వేతనం చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు. పట్ట్భద్రులు కూడా నిరుద్యోగ సమస్యతో హోం గార్డు ఉద్యోగాల్లో చేరారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారి సమస్యలపై మీరు స్వయంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి వారి విషయంలో పెద్ద మనసుతో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలనే తప్ప ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడరాదని ఆయన కోరారు.

సెంట్రల్ వర్శిటీలో
114 పోస్టుల భర్తీ

1053 దరఖాస్తులు ప్రారంభమైన స్క్రూటినీ

హైదరాబాద్, అక్టోబర్ 31: ప్రపంచంలోనే అగ్రగామి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల ఖాళీలు 114 గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయగా 1053 దరఖాస్తులు వచ్చాయని తెలిసింది. వీరందరికీ నవంబర్ 1 నుండి వౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. 30 ప్రొఫెసర్ పోస్టులకు 43, 43 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 170, 41 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 840 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం ఖాళీల్లో 64 పోస్టులు వివిధ కేటగిరి అభ్యర్ధులకు రిజర్వు చేయగా, మిగిలిన 50 పోస్టులు జనరల్ అభ్యర్ధులతో భర్తీ చేస్తారు. కెమిస్ట్రీలో ఏడు పోస్టులకు 167 దరఖాస్తులు రాగా, ప్లాంట్ సైనె్సస్‌లో రెండు పోస్టులకు 129 దరఖాస్తులు వచ్చాయి. ఫిజిక్స్ విభాగంలో మూడు పోస్టులకు 98 దరఖాస్తులు, మేనేజిమెంట్ స్టడీస్‌లో రెండు పోస్టులకు 82 దరఖాస్తులు, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైనె్సస్‌లో మూడు పోస్టులకు 71 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ చివరి వరకూ ఇంటర్వ్యూలను నిర్వహించి జనవరి మొదటి వారంలో నియామకాలు ఇచ్చేందుకు వీలుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే, అంతర్గత పదోన్నతులను పూర్తి చేస్తామని యూనివర్శిటీ అధికారి ఒకరు చెప్పారు. 556 సాంక్షన్ పోస్టులు ఉండగా, అందులో 400 మంది మాత్రమే పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

విత్తనాలకు లోటు లేదు
మంత్రి పోచారం

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ వ్యాప్తంగా రబీ సీజన్‌కు విత్తనాలకు లోటు లేదని, రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన ఈ అంశంపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం 4.85 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు అందించాలని, అదనంగా ఎక్కడైనా వేరుసెనగ, వరి, సెనగ, పప్పుదినుసులు, నూనె విత్తనాలు అవసరమైతే ఇవ్వాలని సూచించారు. ఏ ప్రాంతం రైతులు కూడా ఇక్కట్లకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ ఎం. జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.