తెలంగాణ

గ్రామీణాభివృద్ధితోనే పేదరిక నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి, పేదరిక నిర్మూలన సాధ్యమని, గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డిలో ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌పై అంతర్జాతీయ శిక్షణ శిబిరాన్ని మంత్రి కృష్ణారావు ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో టాంజనియా, నైజిరియా, శ్రీలంక, సూడాన్, జింబాంబ్వే, ఫిజి, ఈజిప్ట్, ఖజికిస్తాన్, మలేషియా, మాల్దీవులు తదితర 20 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణలో పాల్గొన్నారు.
ఎన్‌ఐఆర్‌డి డైరెక్టర్ జనరల్, ఐఎఎస్ అధికారి డబ్ల్యూఆర్ రెడ్డి, ఎన్‌ఐఆర్‌డి ప్రతినిధులు శంకర్ చటర్జీ, చిన్నాదురై, అరుణ జయమణిల ఆధ్వర్యంలో డిసెంబర్ 27 వరకు శిక్షణ తరగతులు జరుగుతాయి. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం ఉపాధి హామీ, పిఎంజిఎస్‌వై, రూరల్ హెల్త్ మిషన్, స్వచ్ఛ భారత్ లాంటి పలు కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి భవిష్యత్తులో తెలంగాణను రోల్‌మోడల్‌గా చూపే విధంగా కెసిఆర్ ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఆసరా పెన్షన్‌లు, విద్యార్థులకు హాస్టల్స్‌లో సన్నబియ్యం భోజనం, కళ్యాణ లక్ష్మి, స్ర్తి నిధి, దీపం పథకం, స్కిల్ డెవలప్‌మెంట్ లాంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలోని ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చి, గ్రామాల్లో పేదరికాన్ని పారద్రోలేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రారంభించినట్టు చెప్పారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గ్రామ స్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలు గ్రామీణ పేదరిక నిర్మూలనకు దోహదపడతాయని మంత్రి అన్నారు.