తెలంగాణ

అవినీతి కూడా ఒక రుగ్మతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: సమాజంలో అవినీతి కూడా ఒక రుగ్మతేనని, అవినీతిని రుగ్మతతో, నిజాయితీని ఆరోగ్యంతో పోలుస్తూ నిజాయితీని ప్రోత్సహించడం ద్వారా శరీరానికి లాగే సమాజఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. సోమవారం సికిందరాబాద్‌లోని రైల్‌నిలయం ఆడిటోరియంలో దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ వారోత్సవాల ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అధ్యక్షతన జరిగిన ‘నిజాయితీని ప్రోత్సహించడంలో-అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం’ అంశంపై సెమినార్ జరిగింది. ఈ సదస్సులో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, పుట్టుకతో ఎవరూ అవినీతిపరులుగా పుట్టరనీ, విద్యావంతుల్లోనే అవినీతి ఎక్కువగా కనిపిస్తుందన్నారు.
ఒకప్పుడు విలువలు ప్రబోధించిన సంప్రదాయ విద్యే అవినీతిని రూపుమాపగలదని అందువల్ల అటువంటి విద్య అవసరమని ఆయన ఉద్ఘాటించారు. సాంకేతిక అవినీతిని తగ్గించిన మాట నిజమే అయినా పూర్తిగా దానిమీదే ఆదారపడకూడదన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రచురించిన ‘విజిలెన్స్ బులెటిన్-2016’ సచేతన్ త్రైమాసిక సంచికను ఆవిష్కరించారు.

దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ వారోత్సవాల ప్రారంభ సభలో ప్రసంగిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి