తెలంగాణ

బూట్లు వేసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రవేశ ఎంపిక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైనాన్ని గుర్తించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్, ఈనెల 11నుంచి జరిగే గ్రూప్-2 రిక్రూట్‌మెంట్‌కు పకడ్బందీ చర్యలు చేపట్టింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు అనుమానిత వస్తువులు తేవొద్దని సూచించింది. అలాగే అభ్యర్థులు బూట్లు, నగలు, చెవిపోగులు, చేతి గడియారాలు కూడా ధరించవద్దని, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, నోట్ బుక్స్, చార్టులు, రికార్టింగ్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. చేతివేళ్లపై గోరింటాకు, ఇంక్ వంటివి లేకుండా చూసుకోవాలని, బయోమెట్రిక్ ఆధారాలు సేకరించినపుడు ఇది ఇబ్బంది అవుతోందని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తోపాటు ఏదైనా ఇతర గుర్తింపుకార్డు తెచ్చుకోవాలని, హాల్‌టిక్కెట్‌పై ఫోటోగాని, సంతకంగానీ లేని అభ్యర్థులు తమవెంట రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9.45తర్వాత, మధ్యాహ్నం 2.15తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలని, పూర్తిస్థాయి సూచనలు, వివరాల కోసం అభ్యర్థులు టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్ సందర్శించాలని అధికారులు సూచించారు. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్ జవాబుపత్రాలు అనర్హమైనవిగా ప్రకటిస్తామని, ఒరిజనల్ ఓఎంఆర్ పత్రంతో కేంద్రం బయటకివెళ్తే అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని కూడా కమిషన్ అధికారులు హెచ్చరించారు.
పరీక్షల షెడ్యూలు
గ్రూప్ -2లో 1032 పోస్టులకుగాను 7,91,957 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. తొలి నోటిఫికేషన్‌కు స్పందిస్తూ 439 పోస్టులకు 5,62,715 దరఖాస్తులు రాగా, మలి నోటిఫికేషన్‌లో 593 పోస్టులకు 2,29,249 దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు నవంబర్ 11, 13 తేదీల్లో జరుగుతాయి. ఇందుకోసం కమిషన్ 1911 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. నవంబర్ 11న పేపర్-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, సాయంత్రం పేపర్-2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ పరీక్ష జరుగుతుంది. నవంబర్ 13న పేపర్ -3 ఎకనామి, మధ్యాహ్నం పేపర్-4 తెలంగాణ మూమెంట్‌పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు ఏపీ నుంచి 11,346 మంది దరఖాస్తు చేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, బీహారు రాష్ట్రాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలవారీ చూస్తే కరీంనగర్ నుంచి 1,15,315 మంది దరఖాస్తు చేయగా, అతి తక్కువగా నిజామాబాద్ నుంచి 48,015 దరఖాస్తులు వచ్చాయి. విద్యార్హతలు లేవని తెలిసినా దరఖాస్తు చేసిన 550మంది అప్లికేషన్లను కమిషన్ తిరస్కరించింది.