తెలంగాణ

కాస్త ఆగండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: సచివాలయాన్ని కూల్చి వేసి నూతన భవనాలు నిర్మించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై హైదరాబాద్ హైకోర్టు తాత్కాలిక బ్రేకు వేసింది. 10 రోజుల వరకూ కూల్చి వేతలు చేపట్టరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయంలోని భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కూల్చి వేయాలనుకుంటున్నదో వివరాలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. సచివాలయంలోని అధునాతనమైన భవనాలను వాస్తు పేరిట కూల్చి వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిందిగా కోర్టును కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన టి. రజనీకాంత్ రెడ్డి, మరో ముగ్గురు వేర్వేరుగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎ. శంకర్ నారాయణ మంగళవారం ఈ వ్యాజ్యం (పిల్‌ల)పై విచారణ చేపట్టారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ఎటువంటి కూల్చివేతలు చేపట్టబోమని ప్రభుత్వం నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నది. సచివాలయం ఆవరణలోని భవనాల్లో ‘జి’ బ్లాకు తప్ప మిగతా భవనాలన్నీ 1986 సంవత్సరం తర్వాతే నిర్మాణం చేపట్టడం జరిగిందని, అవన్నీ పటిష్టంగా ఉన్నాయని పిటీషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సరసాని సత్యంరెడ్డి తెలిపారు. కేవలం వాస్తు పేరిట భవనాలను కూల్చి వేయడం భావ్యం కాదని ఆయన వాదించారు. అలా దుర్వినియోగం చేసే బదులు ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు ఆ నిధులు ఉపయోగించవచ్చని అన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా సచివాలయం ఉందా? అని కోర్టు ప్రశ్నించగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళ కోసం సచివాలయంలోని భవనాలను తెలంగాణకు, ఆంధ్ర ప్రదేశ్‌కు పంచడం జరిగిందని న్యాయవాది వివరించారు. అయినప్పటికీ ఎపికి కేటాయించిన భవనాలను ఖాళీ చేయించి, ఆ శాఖలకు బిఆర్‌కె భవన్‌ను అప్పగించి, ఖాళీ అయిన భవనాలనూ కూల్చి వేసి కొత్తగా నిర్మించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆయన తెలిపారు.
అందుకు అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణా రెడ్డి ప్రతిస్పందిస్తూ కూల్చి వేతపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో వాస్తు ఒక్కటే ప్రధానం కాదని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే మంటలార్పేందుకు అగ్నిమాపక శకటాలు ఆ భవనాల చుట్టూ వెళ్ళే విధంగా ఉండాలన్నది కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని ఆయన తెలిపారు. కొన్ని భవనాల చుట్టూ అగ్నిమాపక శకటాలు వెళ్ళే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా, ఆధునికంగా, అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయన తెలిపారు.