తెలంగాణ

నెహ్రూను తక్కువ చేయటం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ జవహర్‌లాల్ నెహ్రూను తక్కువ చేసి మాట్లాడడం భావ్యం కాదని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు విమర్శించారు. సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ చేయలేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. కానీ ప్రధాని మోదీ సర్దార్‌ను ఎక్కువ చూపి చరిత్రను వక్రీకరించాలని ఆలోచన చేస్తున్నారని ఆయన విమర్శించారు. సర్దార్ పటేల్ గుజరాత్ వ్యక్తి కాబట్టే ప్రధానిగా చేయలేదని మోదీ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. నెహ్రూకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మహాత్మాగాంధీ ఆయనను ప్రధానిగా చేశారని విహెచ్ తెలిపారు. సర్దార్ పటేల్ స్థాయికి మోదీ రాలేరని అన్నారు. నెహ్రు, గాంధీని కించపరిచే ఆలోచన మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నెంబర్-1 అని సర్వే వెల్లడించడం బూటకమని ఆయన విమర్శించారు.
ఆస్తులు కాపాడుకోవటం
కోసమే: మధుయాష్కి
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడు ఆస్తులు కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్ విమర్శించారు. తెలంగాణలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు.