తెలంగాణ

క్రీడలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో యవజన, క్రీడా శాఖలకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన పథకాలు, కార్యక్రమాలు అట్టడుగు వరకు చేరేందుకు వీలుగా సంబంధిత అధికారులంతా పనిచేయాలని రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి పద్మారావు ఆదేశించారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన నేపథ్యంలో 31 జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పథకాలు, కార్యక్రమాల అమల్లో ఏవైనా ఇక్కట్లు, ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
క్రీడల అభివృద్ధికి నిరంతరం పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. క్రీడాశాఖను మరింత బలోపేతం చేస్తామని, నిధులు మరిన్ని ఎక్కువగా వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు, యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు పనిచేయాలని పిలుపు ఇచ్చారు. 2017 జనవరి 12న హర్యానాలో జరిగే యువజన సమ్మేళనానికి వెళ్లే ప్రతినిధి బృందం గురించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ. వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి బి. వెంకటేశం గౌడ్, స్పోర్ట్స్ ఎండి దినకర్‌బాబు, యువజన శాఖ ఎండి మహమ్మద్ అబ్దుల్ అజీమ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.