ఆంధ్రప్రదేశ్‌

రమణ దీక్షితులుకు శ్రీముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, నవంబర్ 1: కలియుగ ప్రత్యక్షదైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని తాకాలంటే అత్యంత పవిత్రంగా లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. మఠాధిపతులైనా, పీఠాధిపతులైనా కూడా వారు గర్భాలయంలోకి వెళ్లడానికి అనుమతిలేదు. ఆ విధంగా టిటిడి నిబంధనలు రూపొందించింది. అయితే ఆలయ ప్రధానార్చకుడుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న డాక్టర్ రమణదీక్షితులు ఆలయ గర్భాలయంలోకి తన మనవడిని తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన బ్రహ్మోత్సవాలు జరిగిన రోజుల్లో చోటుచేసుకున్నట్లు టిటిడి చెబుతోంది. ఈనేపథ్యంలో మంగళవారం రమణదీక్షితులుకు ఆలయ డిప్యూటీ ఇ ఓ రామారావు శ్రీముఖాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమించి ఆలయంలోకి మనవడిని ఎలా తీసుకెళ్తారని, ఇందుకు తగిన వివరణ ఇవ్వాలని టిటిడి శ్రీముఖంలో రమణదీక్షితులను ఆదేశించింది. వంశపారంపర్యంగా ఆలయ ప్రధానార్చకులకు వచ్చే ఈ హక్కుతో మనవడిని తీసుకెళ్లచ్చని ఆయన అనుచరవర్గం వాదిస్తోంది. స్వామివారి గర్భాలయంలో అడుగుపెట్టి విధులు నిర్వహించే అర్చక స్వాములను ఆలయానికి చెందిన గొల్లవంశానికి చెందిన ఉద్యోగి దివిటీ పట్టుకొని ఎవరూ వారిని తాకకుండా ఆలయంలోకి తీసుకెళ్తారు. అందుకు అనుగుణంగానే గర్భగుడిలోకి ప్రవేశించే అర్చకులు మడితో(పరిశుభ్రంగా) ప్రవేశిస్తారు. అలాంటి వారు మాత్రమే స్వామివారి మూలవిరాట్టు, సాలగ్రామ శిలారూపుడై కొలువై ఉన్న స్వామివారికి కైంకర్యాలు, అలంకరణ, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశ రాష్టప్రతి అయినా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రులైనా, ప్రపంచంలో ఉన్న మరే ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చినా వారు స్వామివారి గర్భాలయానికి 3 అడుగుల దూరంలో ఉన్న కులశేఖర పడి (స్వామివారు కొలువుదీరిన గర్భాలయ ద్వారం) దాటి వెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. సాక్షాత్తూ ఆలయ ప్రధానార్చకులకే టిటిడి నిబంధనల పట్ల స్వామివారి ఆలయ పవిత్రత పట్ల విశ్వాసం లేకపోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఒక మఠాధిపతి శ్రీవారి దర్శనానికి వచ్చినపుడు మూలవిరాట్‌కు సమీపంలో ఉన్న రాములవారి మేడ తలుపులు మూసి ఆయన్ను గర్భగుడిలోకి అనుమతించారని ప్రచారం సాగింది. అప్పట్లో అది వివాదా స్పదంగా మారింది. ఆలయ గర్భగుడిలోకి ఎవరు ప్రవేశించినా వాటికి సంబంధించిన అధారాలు ఉండవు. అందుకు ఆత్మేసాక్షి కావాలి. ఎందుకంటే రాములవారి మేడ వరకు మాత్రమే (లఘుదర్శనంకు భక్తులను అనుమతించే ప్రాంతం) సిసి టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆగమశాస్త్రాల ప్రకారం ఆ ద్వారం తరువాత ఎలాంటి సిసి కెమెరాలు ఏర్పాటు చేయకూడదనే నిబంధనలు ఉండటమే. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు తాను తన మనవడిని తీసుకెళ్లానని అంగీకరించి వివరణ ఇస్తారా లేక అసలు తీసుకవెళ్లలేదని అంటారా అన్నది వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా టిటిడి అధికారులు శ్రీవారి ఆలయంలో చేపడుతున్న పలు తప్పుడు సంప్రదాయాలను రమణ దీక్షితులు ప్రశ్నించినందుకే ఆయనపై అధికారులు కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

తిరుమల ప్రధాన
అర్చకుడు రమణ దీక్షితులు