తెలంగాణ

మల్కన్‌గిరిలో హెల్త్ ఎమర్జెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 1: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. జపనీజ్ ఎన్‌సైఫలైటిస్ (మెదడువాపు) వ్యాధి చిన్నారులను కబళిస్తోంది. ఇటీవలి కాలంలో 69 మంది పసికూనలు మెదడువాపు వ్యాధితో కన్నుమూశారు. గడచిన రెండు రోజుల్లోనే నలుగురు చిన్నారులు చనిపోయారు. దీంతో మల్కన్‌గిరి జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కలిమెల, పొడియా, కోరుకొండ బ్లాక్‌లలోని చిత్రకొండ, రాళ్లెగడ్డ, గుండవాడ, పిల్లగెడ్డ, కాట్రగడ్డె, తదితర గ్రామాల్లో వ్యాధి విజృంభిస్తోంది. 2012, 2015 సంవత్సరాల్లోనూ ఈ వ్యాధి బారినపడి 8 మంది చనిపోయారు. కానీ ఈసారి వందల సంఖ్యల్లో గిరిజనుల పిల్లలు మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 69 మంది చనిపోవడంతో ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రస్తుతం 200 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించగా వీరిలో 80 మంది కోలుకున్నారని, 30 మంది చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.
15 మంది చిన్నారులు ఐసియులో మృత్యువుతో పోరాడుతున్నారు. కానీ పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలు గిరిజన పల్లెల్లో కన్పించడం లేదు. ఎక్కడచూసినా అపరిశుభ్రతే తాండవిస్తోంది. బిఎస్‌ఎఫ్ జవాన్లు మాత్రం గిరిజన పల్లెల్లో ఫాగింగ్ చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.