తెలంగాణ

సరిహద్దులకు భారీగా బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 1: ఏవోబి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్టల్ల్రో గురువారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దులకు భారీగా బలగాలను తరలిస్తున్నాయి. ఏవోబి, దండకారణ్యంలో అప్పుడే మావోయిస్టులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఐదు రాష్ట్రాల బంద్‌ను విజయవంతం చేయాలని ఇటు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, అటు ఆంధ్రా అధికార ప్రతినిధి, ఏవోబి ఈస్ట్ జోన్ కమిటీ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్కే జాడ ఇంకా తెలియక ఆందోళన చెందుతూ, 32 మంది తమ సహచరులను కోల్పోయిన సంఘటనను జీర్ణించుకోలేని మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను ఇప్పటికే హెచ్చరించాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై తెలుగు రాష్ట్రాల హైకోర్టులో పిటిషన్ దాఖలు కావటం, ఆర్కే ఎక్కడ ఉన్నాడంటూ ఆంధ్రా సర్కారును న్యాయస్థానం ప్రశ్నించడం, ప్రజాసంఘాల నిరసనలు నడుమ రేపటి బంద్ ఉద్రిక్తతలకు వేదికౌతోంది. ఇప్పటికే విశాఖ మన్యంలో బ్యానర్లు వెలిశాయి.
ఏవోబిలోని గిరిజన గ్రామాల ప్రజలు ఆచూకీ లేకుండా పోయిన తమ వారు 13మంది గురించి ఆందోళనలు చేస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్న వేళ ఏ విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు సిద్ధపడుతున్నాయి. భారీగా బలగాలను మోహరించడం ద్వారా మావోల చొరబాట్లను అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించారు.
మాజీనక్సలైట్లు, ఇన్‌ఫార్మర్లు, నిఘా వర్గాల సమాచారంతో దళాల కదలికలను గుర్తిస్తూ కూంబింగ్ ఆపరేషన్లు భారీగా నిర్వహిస్తున్నారు. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు కయ్యానికి కాలుదువ్వుతుండటంతో గిరిజన గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని బెంబేలెత్తుతున్నారు. మరోవైపు గ్రామస్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులంతా పట్టణాలకే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో మావోయిస్టు యాక్షన్ బృందాలు సంచరిస్తున్నాయనే సమాచారంతో మండల, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో నిఘాను పెంచారు.
ఎదురయ్యే విపత్కర పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసు ఉన్నతాధికారులు వ్యూహరచనలు చేస్తున్నారు. పగతో రగిలిపోతున్న మావోయిస్టుల దూకుడును ఎలా ఎదుర్కొంటారనేదే ప్రశ్న.