ఆంధ్రప్రదేశ్‌

ఆర్కే పోలీసుల అదుపులో లేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 1: మావోయిస్టు అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆయన రాష్ట్ర పోలీసుల అదుపులో లేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్‌లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం సాయంత్రం చినరాజప్ప విలేఖరులతో మాట్లాడారు. కూంబింగ్‌లో భాగంగానే పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరగడంతో ఒక పోలీసుతో పాటు 32మంది మావోయిస్టులు మృతిచెందారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు వాస్తవాలనే వివరిస్తున్నారని, ఒకవేళ ఆర్కే వారి అదుపులో ఉండివుంటే బయటకు వెల్లడించేవారు కదా? అని వ్యాఖ్యానించారు. ఎఒబిలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.
స్మృతి మందిరంగా కృష్ణశాస్ర్తీ నివాసం
ప్రఖ్యాత కవి, కళాప్రపూర్ణ దేవులపల్లి కృష్ణశాస్ర్తీ స్వగృహాన్ని దేవులపల్లి స్మారక మందిరంగా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెంలో మంగళవారం దివంగత దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 120వ జయంతి కార్యక్రమానికి చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవులపల్లి అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడారు. భావకవిగా తన రచనలతో తెలుగు ప్రజానీకాన్ని మైమరపించిన దేవులపల్లి తూర్పు గోదావరి జిల్లా వాసి కావడం తమకు గర్వంగా ఉందన్నారు. చంద్రంపాలెంలోని దేవులపల్లి గృహానికి మరమ్మతులు చేపట్టి, స్మారక మందిరంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. దేవులపల్లి సేవాభావంతో తన నివాస గృహాన్ని స్థానిక పాఠశాల కోసం విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రంపాలెం నుండి చిత్రాడ వరకు రూ.1.45 కోట్లతో నూతనంగా రహదారి నిర్మించి, దానికి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ మార్గంగా నామకరణం చేస్తామని చెప్పారు. గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో దేవులపల్లి పౌర గ్రంథాలయం, సుమారు రూ.20 లక్షల వ్యయంతో కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపి తోట నరసింహం మాట్లాడుతూ దేవులపల్లి జయంతిని వచ్చే ఏడాది నుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా దేవులపల్లి ఛారిటబుల్ ట్రస్ట్‌ను చినరాజప్ప ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న ఏపి హోం మంత్రి చినరాజప్ప