ఆంధ్రప్రదేశ్‌

ఐటిడిఎ పిఒ బంగ్లాలో ఏసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 1: సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావుకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో మంగళవారం అవినీతినిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీతంపేటలోని పీవో బంగ్లాతోపాటు, శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ, విశాఖపట్నంలో పివో బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డి.ఎస్పీ రంగరాజు తెలిపారు. మార్కెట్ విలువల ప్రకారం కోటి విలువ గల ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు. ఒక ప్లాటు, రెండు ఇళ్ళు, మూడు స్థలాలు, ఒక కారు, రెండు లాకర్లు గుర్తించామన్నారు. మొత్తం ఎనిమిది బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నట్టు డిఎస్పీ చెప్పారు. అయితే, సీతంపేటలో హైడ్రామా చోటుచేసుకుంది. నేరుగా అవినీతి నిరోధకశాఖ అధికారులు ప్రాజెక్టు అధికారి బంగ్లాకు చేరుకుని వెంకటరావును అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఐటిడీఏ కార్యాలయానికి తీసుకువచ్చి ఈ దాడులకు సంబంధించిన పంచనామా కూడా నిర్వహించారు. ఇదే సందర్భంలో ఎసీబీ డి.ఎస్పీ రంగరాజు రూ.కోటి 10 లక్షల రూపాయలు అక్రమాస్తులు ఉన్నట్టు వెల్లడిస్తునే రెండు లాకర్లు తెరవవలసివుందని, మరో రెండు రోజులపాటు సోదాలు నిర్వహిస్తామని మీడియాకు డిఎస్పీ వివరించారు. ఇంతలో ఏమైందో తెలియదుగాని, అదుపులోకి తీసుకున్న పి.వో. వెంకటరావును విడిచిపెట్టి, అధికారులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు రాష్ట్ర ఎసీబీ డైరక్టర్‌కు నేరుగా ఫిర్యాదు అందడంతో అక్కడ నుంచి జిల్లా ఎసీబీ అధికారులకు సోదాలు నిర్వహించాలంటూ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

సింగ్‌పూర్‌లో ప్రపంచ
తెలుగు సాహితీ సదస్సు

విశాఖపట్నం, నవంబర్ 1: ప్రపంచ వేదికపై తెలుగువారందర్ని కలపాలనే లక్ష్యంతో సింగ్‌పూర్‌లో ఈ నెల 5,6 తేదీల్లో ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. మంగళవారం విశాఖ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగ్‌పూర్ తెలుగు సమాజం 40వ వార్షికోత్సవాల సందర్భంగా తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ తెలుగు సాహితీ సంఘం, పంగసూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సింగ్‌పూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు రవికుమార్ స్వాగతోపన్యాసం చేస్తారన్నారు. ఈ సందర్భంగా తెలుగుభాష ఔన్నత్యాన్ని తీసుకువస్తున్న పలువురు అధ్యాపకులకు సత్కార కార్యక్రమం ఉంటుందన్నారు.