ఆంధ్రప్రదేశ్‌

కలిసి పనిచేస్తేనే మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టిడిపి కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు. దీంతో కిమ్మనకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఇన్‌చార్జులు హెచ్చరికలు జారీచేసిన నేపధ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ నాయకులు ఇగో మానుకుని కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని హెచ్చరికలు జారీచేశారు. జనచైతన్యయాత్రలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఒంగోలు నియోజకవర్గపరిధిలోని కొప్పొలు గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఒంగోలులోని ఎ-వన్ కన్వన్షన్ హాలులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షత వహించారు. ముఖ్యంగా కార్యకర్తల సమావేశంలో ఇన్‌చార్జులు, నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాయకులు విభేదాలు వీడి ఇతర పార్టీల నుండి వచ్చిన వారితో కలిసి పనిచేయాలని, లేని పక్షంలో పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో గిద్దలూరు, అద్దంకి, చీరాల, కందుకూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని అసమ్మతి నాయకులకు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినట్లైంది. భవిష్యత్‌లో ఎలాంటి ఇతర నియోజకవర్గాల్లోను అసమ్మతులు రాకుండా ముందుగానే ఈసమావేశం ద్వారా హెచ్చరికలు జారీచేయటంతో నేతలందరుకిమ్మనకుండిపోయారు. ప్రధానంగా కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో జిల్లాలో, రాష్ట్రంలో మిగిలిఉన్న నామినేటెడ్ పదవులను భర్తీచేస్తానని అందువలన పదవుల రాని వారు ఆందోళన చెందవద్దని అందరిని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఇదిలాఉండగా రామాయపట్నం,వాన్‌పిక్‌పోర్టులను జిల్లాలో ఏర్పాటుచేస్తానని జిల్లాప్రజలకు హామీ ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్ధాపన చేశానని, తానే ప్రాజెక్టును పూర్తిచేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య ఉందని ఆ సమస్యను అధిగమించేందుకు కృషిచేయటమే కాకుండా అవసరమైతే రెండు రూపాయలకే 20 లీటర్ల క్యాన్ల ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. అదేవిధంగా బెంగళూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలను కలుపుతూ ప్రకాశం జిల్లా మీదుగా రాయలసీమ ప్రాంతానికి ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటుచేస్తానని వెల్లడించారు. జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ లేదా ఇతర యూనివర్శిటీని ఏర్పాటుచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. భైరవకోననుండి నారాయణస్వామి దేవాలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దొనకొండలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా త్వరలో కనిగిరి ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఒంగోలుకు ట్రిపుల్‌ఐటిని మంజూరు చేశామన్నారు. త్వరలో భవనాలను నిర్మిస్తామన్నారు. త్వరలో జరగనున్న ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావాలని పార్టీశ్రేణులకు ముఖ్యమంత్రి హితబోధ చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒంగోలు కార్పోరేషన్‌లోని 50 డివిజన్లల్లో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందే విధంగా నాయకులు పనిచేయాలని సూచించారు. పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పార్టీశ్రేణులు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇదిలాఉండగా కొప్పొలు గ్రామంలో జరిగిన సభలో కొప్పొలుతోపాటు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు,మహిళలు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ నియోజకవర్గాన్ని పూర్తిస్ధాయిలో అభివృద్ది చేయటమేకాకుండా పార్టీశ్రేణులకు అందుబాటులో ఉంటున్నారన్నారు.

కొప్పోలులో జరిగిన సభలో డ్వాక్రామహిళలతో మాట్లాడుతున్న సిఎం