తెలంగాణ

వెనె్నలకు యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: నెదర్లాండ్‌కు చెందిన చైల్డ్ అండ్ యూత్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అంకుర సంస్థలకు నిర్వహించే యువ ఎంటర్‌ప్రెన్యూర్‌లకు యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును ఈసారి హైదరాబాద్‌కు చెందిన వెనె్నలకృష్ణ ఎంపికైంది. ఈ సంస్థ తొలిసారిగా అక్టోబర్‌లో ముంబైలో ఈ పోటీని నిర్వహించింది. 19-30 సంవత్సరాల వయసుగల యువ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఇచ్చే బహుమతి ప్రక్రియలో అనేక వడపోతల తరువాత ఎన్నికైన పధ్నాలుగు మందిలో అతి పిన్న వయస్కురాలు, హైదరాబాద్‌కు చెందిన వెనె్నల కృష్ణ విజయం సాధించి యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ ఇండియా 2016 అవార్డును సాధించింది. నవంబర్ నెలాఖరులో స్కాట్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ సన్మాన సభ వేదికపై వెనె్నల కృష్ణకు ఈ అవార్డును భారత ప్రతినిధిగా అందజేస్తారు. నోబెల్ బహుమతులు ఇచ్చే అంతర్జాతీయ వేదిక స్టాక్‌హోమ్ సిటీ హాల్‌లోనే ఈ వేడుకలు జరుగుతాయి.
హైదరాబాద్‌కు చెందిన వెనె్నల కృష్ణ నగరంలోని లా స్కూల్ 101 పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తోంది. జాతీయ న్యాయ కళాశాలలు నిర్వహించే ప్రవేశపరీక్షను రాసే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే ఈ సంస్థ గత మూడు సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు నేషనల్ లా స్కూల్‌లో చదవడానికి అర్హతను సాధించడంలో తోడ్పడింది.
భారత ప్రతినిధిగా అంతర్జాతీయ బహుమతి అందుకోనున్న వెనె్నల కృష్ణ నల్సార్ లా యూనివర్సిటీలో నాలుగవ సంవత్సరం చదువుతోంది. విద్యార్థినిగా చదువులో అత్యున్నతమైన ర్యాంక్‌లు సాధిస్తూనే, అంకుర సంస్థను ప్రారంభించి వాణిజ్య రంగంలో యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించి పురస్కారానికి ఎంపిక కావడం విశేషం.

అడవి పంది దాడిలో మహిళ మృతి

జన్నారం, నవంబర్ 1: ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన కె.సుక్కమ్మ (40) అనే వివాహిత అడవి పంది దాడిలో మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం మేరకు సుక్కమ్మ సోమవారం రాత్రి జన్నారం ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకొని తిరిగి వెళ్తూ టిజి పల్లి వద్ద నిల్చొని ఉండగా ఆమెపై అడవి పంది దాడి చేసింది. దీంతో స్థానికులు వెంటనే సుక్కమ్మను లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. బాధిత కుటుంబానికి అటవీ శాఖ అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మురిమడుగు గ్రామ సర్పంచ్ గోలి రాంచందర్ రెడ్డి డిమాండ్ చేశారు.