తెలంగాణ

హోంగార్డులకు కాలుష్య భత్యం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: హోంగార్డులకు ఉద్యోగ భద్రతతోపాటు జీతాలు పెంచాలని, 30 శాతం కాలుష్య భత్యం ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మంగళవారం డిజిపి అనురాగ్‌శర్మను కోరారు. పోలీస్ నియామకాల్లో హోంగార్డులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మూడేళ్లు సర్వీసు కలిగిన వారికి పోలీస్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ ఇవ్వాలని, ప్రభుత్వ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలని, సంవత్సరానికోసారి డిఏ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. హోంగార్డుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60ఏళ్లకు పెంచాలని, రూ. 5 లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని, ఉచిత బస్‌పాస్, వారాంతపు సెలవు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిజిపి అనురాగ్‌శర్మకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
హోంగార్డులపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయంపై పునరాలోచించి, వారిని విధుల్లో చేర్చుకోవాలని హోంగార్డు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన హోంమంత్రి నాయిని, డిజిపి అనురాగ్‌శర్మలకు వినతి పత్రాలు సమర్పించారు.