తెలంగాణ

‘మల్లన్నసాగర్’పై తొలగని మడతపేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 1: మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని కొండపాక, తొగుట మండలాల పరిధిలోని 14 గ్రామాలకు చెందిన భూములు సేకరించడానికి రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది. భూ నిర్వాసితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రభుత్వం 123 జివోను తీసుకురాగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు జివోను వ్యతిరేకిస్తూ 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఉద్యమాల బాట పట్టారు. సాదా బైనామాలతో లిటిగేషన్ ఉన్న భూములను స్వీకరించడానికి అధికారులు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో అక్కడ లాఠీ చార్జీ సైతం కొనసాగిన విషయం తెలిసిందే. అనంతరం అన్ని గ్రామాల్లో రిలే నిరహార దీక్షలు చేపట్టి భూ సేకరణ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కాగా ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడం అధికార టిఆర్‌ఎస్ పార్టీ మినహా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపడంతో ప్రభుత్వం సైతం దిగివచ్చింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి కల్పించుకుని ఆయా గ్రామాలకు చెందిన రైతులతో చర్చలు జరిపి ఆమోదం పొందినా ఒక్క వేముల్‌గట్ ప్రజల్లో మాత్రం మార్పు తీసుకురాలేకపోయారు. మల్లన్న సాగర్ భూ సేకరణ ఉద్యమం ప్రారంభమైంది మొదలుకుని నేటి వరకు మడమ తిప్పకుండా వేముల్‌గట్ రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఎం, సిపిఐ వామపక్షాలు, ప్రజాసంఘాలు, తెలంగాణ జెఎసి, రైతు సంఘాలు అన్ని సంయుక్తంగా మద్దతు పలికారు. రైతులపై లాఠీ చార్జీ, గాల్లోకి కాల్పులు జరిపి, ఉద్యమాల గ్రామాలను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నా వేముల్‌గట్ ప్రజలు మాత్రం మొండి ధైర్యంతో తమ దీక్షలను కొనసాగిస్తున్నారు.
గాల్లోకి కాల్పులు, లాఠీచార్జి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించగా, కోర్టు ఆదేశాల మేరకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తమకు ఏ చట్టం ప్రకారం పరిహారం అక్కర లేదని, తాము తరతరాలుగా భూములను సాగు చేసుకుని బతుకుదెరువు కొనసాగిస్తున్నామని, తమకు ప్రాజెక్టు అవసరం లేదని గ్రామస్థులు ప్రతిరోజూ నినదిస్తున్నారు. వేముల్‌గట్ గ్రామానికి చెందిన సుమారు 5 వేల పైచీలుకు భూమి ఉండగా, సాదా బైనామాల లిటిగేషన్, గ్రామంలో ఉండని వారి భూ సేకరణ చేసినా కొద్దిపాటియే కాగా పట్టా భూములు మాత్రం రెండు వేలకుపైగానే ఉండటంతో ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సంకట పరిస్థితులు కల్పిస్తోంది.