తెలంగాణ

అక్రమ లేఔట్లకు అధికారులదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: మేడ్చెల్ జిల్లాలోని ప్రగతినగర్ గ్రామ పంచాయితీని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి వెంట కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ కూడా ఉన్నారు. గ్రామ పంచాయితీల పరిధిలో అనుమతి లేకుండా అక్రమలేఅవుట్లు చేసినా, ఎలాంటి నిర్మాణాలు జరిగినా అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రగతినగర్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న నాలుగంతస్తుల భవనాన్ని మంత్రి గుర్తించారు. అక్రమంగా నిర్మిస్తున్న భవనం బహిరంగంగా కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతినగర్ గ్రామంలో కార్యదర్శిగా గతంలో పనిచేసిన మనోహర్, ప్రస్తుతం కార్యదర్శిగా పనిచేస్తున్న వౌలానాలను అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఇఓ పి అండ్ ఆర్‌డిగా పనిచేస్తున్న జ్యోతి, గతంలో ఇఓ పి అండ్ ఆర్‌డిగా పనిచేసిన మల్లారెడ్డికి చార్జీమెమోలు ఇవ్వాలని డిపిఓ సురేషన్‌ను ఆదేశించారు. ప్రగతినగర్‌లో అనుమతి లేకుండా చేసిన లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.
ప్రగతినగర్‌లో గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్క్, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాలు, కమ్యూనిటీ హాల్‌లను మంత్రి పరిశీలించారు. వీటి నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో మురుగునీటిని శుద్ది చేసి తిరిగి మొక్కలకు వినియోగిస్తున్న విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఇతర గ్రామపంచాయితీలు కూడా ఈ తరహాలోనే మురుగునీటి రీసైక్లింగ్ చేయాలని సూచించారు. గ్రామశివార్లలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వలస కార్మికులతో మంత్రి కృష్ణారావు మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. తర్వాత పంచాయితీ ఆదాయ, వ్యయం రికార్డులను పరిశీలించారు. పంచాయితీ పాలకవర్గంతో సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామపంచాయితీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.