తెలంగాణ

ఫార్మా రంగానికి సర్కార్ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 1: ఫార్మారంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం కందుకూరు వద్ద 6వేల ఎకరాలు కేటాయించినట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ శివారులో ఫార్మసి కళాశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలుష్యరహిత పరిశ్రమల స్థాపనపై దృష్టి సారిస్తున్న సర్కార్ పెట్టుబడుల సాధన రేసులో ముందున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రాన్ని తలదనే్న రీతిలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి నాణ్యతతోకూడిన ఉత్పత్తుల లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. విద్యావ్యవస్థలో విపరీత ధోరణులు కన్పిస్తుండగా, సమూల మార్పుల కోసం సర్కార్ కసరత్తు చేపట్టినట్లు చెప్పారు. అంతరించిపోతున్న వౌలిక విద్యావిధానానికి పూర్వ వైభవం తెస్తూ సామాజిక విలువలతోకూడిన చక్కటి ఉజ్వల భవిష్యత్తు కోసం జ్ఞాన సముపార్జన లక్ష్యంగా దృష్టి పెట్టగా, అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్ధులు ముందుండాలని ఆకాంక్షించారు. కాగా దివంగత ప్రధాని, గొప్ప ఆర్థిక సంస్కర్త, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు స్ఫూర్తితో సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట వాణీదేవి అందిస్తున్న సేవలు చిరస్థాయిగా ఉంటాయని, జాతీయ స్థాయిలో పేరున్న ఆ సంస్థ యూనివర్శిటీ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వయోగి విశ్వం మహరాజ్, శ్రీ విద్యా సరస్వతి క్షేత్ర వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ విసి సీతారామారావు, ఐపిఎ ఎడ్యుకేషనల్ చైర్మన్ టివి నారాయణ, జెఎన్‌టియు రిజిస్ట్రార్ యాదయ్య, గాయకుడు దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మసీ కళాశాల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు