తెలంగాణ

భయపెట్టి భూసేకరణ చేపట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 1: రైతుల త్యాగాల ఫలితంగానే సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని, అలాంటి రైతుల భూమి సేకరించేటప్పుడు అవగాహన కల్పించి న్యాయమైన పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని, అలాకాకుండా భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని గోలివాడ గ్రామంలో కాళేశ్వరం మేడిగడ్డ పంప్ హౌస్ నిర్మాణంలో భూములు కొల్పోతున్న రైతులతో ఆయన మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఇక్కడ జరుగుతున్న భూ సేకరణ, అధికారుల తీరు, చెల్లిస్తామని చె బుతున్నటువంటి పరిహారం విషయాలను కోదండరాం దృష్టికి తీసుకువచ్చారు. ఎకరా 14 లక్షల పైచిలుకు ఉంటే 6 లక్షల వరకే పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోయారు.
దీంతో కోదండరాం మాట్లాడుతూ పరిహారం చెల్లింపులంతా న్యాయబద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. గోలివాడ రైతులకు తెలంగాణ జెఎసి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోలివాడ రైతులు తదితరులు పాల్గొన్నారు.

గోలివాడ గ్రామ రైతులతో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం