తెలంగాణ

సెంట్రల్ వర్శిటీకి అంతర్జాతీయ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి మరో ఖ్యాతి దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో యూనివర్శిటీకి 14వ ఉత్తమ విశ్వవిద్యాలయంగా గుర్తింపు దక్కింది. యుఎస్ న్యూస్ వరల్డ్ రిపోర్టు-2017లో బెస్ట్ గ్లోబల్ యూనివర్శిటీల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ 14వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలకు చెందిన 1262 విశ్వవిద్యాలయాల స్థాయిత్వాన్ని అంచనా వేసిన ఈనివేదిక ప్రకారం భారత్‌లో అగ్రస్థానంలో పంజాబ్ యూనివర్శిటీ నిలిచింది. దాని తర్వాత బెంగలూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిలిచింది. వాటి తర్వాత స్థానాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దక్కించుకుంది. మొదటి 14 సంస్థల్లో తొలి ఎనిమిది సంస్థలు పరిశోధనాత్మక సంస్థలు కావడంతో యూనివర్శిటీల వరకే తీసుకుంటే యుఓహెచ్‌కు ఆరో స్థానం దక్కినట్టయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ 9వ స్థానం జెఎన్‌యు 19వ స్థానంలో నిలిచాయి. ప్రధానంగా 12 సూచీలను పరిగణనలోకి తీసుకుని ఈ గ్రేడింగ్‌లను ఇచ్చింది. అంతర్జాతీయంగా ఆయా సంస్థల పరిశోధలకు ఉన్న ప్రాధాన్యత, ప్రాంతీయ ప్రాధాన్యత, ప్రచురణలు, సదస్సులు, ఇతర అంశాలను కూడా పరిశీలించింది.

పార్ట్‌టైమ్ టీచర్లకు
ఓటు హక్కు లేదు
మండలి ఎన్నికలపై భన్వర్‌లాల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 2: ఆంధ్రాలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికలకు ఓటర్లు నమోదుకు నవంబర్ 5వ తేదీ వరకూ గడువు ఇచ్చినట్టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. పార్టు టైమ్ టీచర్లకు మండలి ఎన్నికల్లో ఓటరుగా చేరే హక్కు లేదని, అలాగే టీచర్ల గుర్తింపు పత్రాలను సర్టిఫై చేసే అధికారం లేదని కూడా సిఇఓ స్పష్ట చేశారు. ఆంధ్రాలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు టీచర్ల నియోజకవర్గాలకు, తెలంగాణలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాఠశాలల టీచర్లను డిఇఓలు లేదా తత్సమాన అధికారి మాత్రమే సర్టిఫై చేయాలని ఆయన చెప్పారు. ఒక వేళ హెడ్మాస్టర్లను సర్టిఫై చేయాల్సి వస్తే తానే స్వయంగా చేసుకోవాలే తప్ప ఎంఇఓలతో చేయించరాదని ఆయన వివరణ ఇచ్చారు.