తెలంగాణ

భక్త రామదాసు ప్రాజెక్టు డిసెంబర్‌లో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనులను ఆ లోగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావును మంత్రి ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరాపై గురువారం సాయంత్రం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు చర్చించారు. భక్తరామదాసు ఎత్తిపోతలతో పాటు కాళేశ్వరం, దేవాదుల, అనంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయకిసాగర్, మేడారం, రామడుగు ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్, వాటికి అయ్యే ఖర్చుపై ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులకు కలిపి విద్యుత్ సరఫరాకు దాదాపు రూ.3,300 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు వివరించారు. ఇందులో 25 శాతాన్ని తమ శాఖ భరిస్తుందని మంత్రి చెప్పారు.
30 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధం
రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి 30 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, తుపాకులగూడెం, బ్యారేజిల వద్ద 30 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇక్కడ ఇసుకను వెలికి తీయడానికి వెంటనే క్వారీలను ప్రారంభించాలని గనులశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో దాదాపు 100 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఇసుక అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఇక్కడ ఇసుక తవ్వకానికి అనుమతి ఇస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని మంత్రి అన్నారు.