తెలంగాణ

ఆయుష్ విద్యార్థుల స్టయఫండ్ హెచ్చింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణలో భారతీయ వైద్య కాలేజీల్లో (హౌజ్ సర్జన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్) విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్ట్ఫైండ్‌ను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు గురువారం జీఓ (జిఓఎంఎస్ నెంబర్ 152) జారీ అయింది. అల్లోపతి వైద్య కాలేజీల్లో విద్యార్థులకు ఇచ్చే స్ట్ఫైండ్‌కు సమానంగా హోమియో, ఆయుర్వేద, యునాని, ప్రకృతి వైద్య విధానాల్లో నడుస్తున్న గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు స్ట్ఫైండ్ చెల్లిస్తారు. హెచ్చింపు 2014 జనవరి 1 నుండి అమలు చేస్తారు. వాస్తవంగా వీరికి స్ట్ఫైండ్ 2012 జనవరి 1 నుండే పెంచాలని ఆయుష్ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సంవత్సరం జూన్ 25న లేఖ రాశారు. పాత బకాయిలను చెల్లించేందుకు 13.86 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. అన్నికోణాల్లో పరిశీలించిన ప్రభుత్వం స్ట్ఫైండ్ పెంచుతూ 2014 జనవరి 1 నుండి అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది.హౌజ్‌సర్జన్ చేసే విద్యార్థులకు ప్రస్తుతం 8000 రూపాయలు ఇస్తుండగా, ఇకనుండి 10,580 రూపాయలు చెల్లిస్తారు. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విద్యార్థుల్లో మొదటి సంవత్సరం వారికి 18 వేల నుండి 23,805 రూపాయలకు పెంచారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 19 వేల నుండి 25,128 రూపాయలకు పెంచారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు 20 వేల నుండి 26,450 రూపాయలకు పెంచారు. ఆయుష్ శాఖకు 2016-17 సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ నుండి ఖర్చు భరించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ కోరారు.