తెలంగాణ

రైతులకు రుణాల బాధ్యత అధికారులదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలే కాకుండా బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలు ఇప్పించడంలోనూ సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రెడ్ హిల్స్ ఫ్యాప్సి భవనంలో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల జోనల్ స్థాయి అవగాహన, సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు రైతులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర వచ్చేంత వరకు జిల్లలో మార్కెటింగ్ శాఖ ద్వారా నూతనంగా నిర్మించిన గోదాములలను పంట నిల్వకు ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులకు క్షేత్ర స్థాయిలో సాంకేతిక సమాచారం ఇచ్చేందుకు వ్యవసాయ సాంకేతిక సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. రైతు బంధు పథకం ద్వారా పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు.
జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు. రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించే బాధ్యత అధికారులు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటిష్టం చేసేందుకు రైతు అవసరాలను ఏకగవాక్ష విధానం ద్వారా అందించేందుకు సహకార సంఘాలు కృషి చేయాలని చెప్పారు. గ్రామంలో రైతులకు విద్యుత్ అంతరాయం చోటు చేసుకున్నప్పుడు వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని సంబంధిత అధికారులకు సూచించాలని మంత్రి చెప్పారు.
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ సూచనలు, సాంకేతిక సలహాలు అందించడంతో పాటు రైతులకు వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాల్లో అండగా ఉండాలని అన్నారు. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డి మాట్లాడారు.
హైదరాబాద్ జిల్లా సహకార సంఘం అధ్యక్షులు పెంటారెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్న సహకార సంఘాలు ఆరు శాతం రిబేటుతో రుణాలు మంజూరు చేయాలని కోరారు.