తెలంగాణ

నిత్యావసర సరుకులను సక్రమంగా అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా నిత్యావసర సరకులు క్రమం తప్పకుండా ప్రజలకు అందించాలని పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ కోరారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో రేషన్ డీలర్లతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, సబ్సిడీ బియ్యం పేదలకు కిలో రూపాయికే అందిస్తున్నామని, ఈ పథకం పారదర్శకంగా, సమర్థతగా అమలు చేయాల్సిన బాధ్యత డీలర్లపైనే ఉందన్నారు. బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అందించాలన్నారు. ఇందుకోసం నిర్ణీత తేదీల్లో రేషన్ దుకాణాలు తప్పని సరిగా తెరవాలని, సమయ పాలన సరిగ్గా పాటించాలని ఆదేశించారు. డీలర్లకు కమిషన్ హెచ్చింపు తదితర విషయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రేషన్ దుకాణాలు సక్రమంగా, సమర్థతగా పనిచేస్తున్నాయన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలని సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక్కో దుకాణానికి 400 నుండి 500 కార్డులు ఉన్నాయని, నెలవారీగా 5250 రూపాయలు తమకు ఖర్చవుతుండగా, ఆదాయం మాత్రం 3516 రూపాయలు మాత్రమే లభిస్తోందని డీలర్లు ఈ సందర్భంగా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కారణంగా తమకు సరకులపై ఇస్తున్న కమిషన్‌ను పెంచాలని కోరారు.