తెలంగాణ

మద్యంపై బిజెపి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజాద్రోహమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ భయంకర సమస్యపై సమాజాన్ని తట్టి లేపడానికి, విచ్చలవిడిగా పెరిగిపోతున్న మద్యపానాన్ని నియంత్రించడానికి, బిజెపి సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు నవంబర్ 11న ఉదయం 10 గంటల నుండి నవంబర్ 12 ఉదయం 10 గంటల వరకూ అబ్కారీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించారు.
మద్యం దుకాణాలను, పర్మిట్ రూమ్‌లను, బార్లను రాత్రి 12 గంటల వరకూ అనుమతించడం ద్వారా బెల్టు షాప్‌లు గ్రామీణ ప్రజా జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం కేవలం అబ్కారీ ఆదాయంపైనే దృష్టిసారించిందని అన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 35వేల కోట్లు బడుగు బలహీన దిగువ మధ్యతరగతి వర్గాల కష్టార్జితాన్ని మద్యం మాఫియా , రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొల్లగొడుతున్నాయని అన్నారు. కుటుంబాలకు కుటుంబాలే ఛిద్రమై రోడ్డున పడుతున్నాయని, గృహ హింస పెరిగిపోతోందని, లక్షలాది కుటుంబాల్లో తల్లులు, ఆడపడుచులు రోధిస్తున్నారని , టీనేజర్లు తాగుడికి బానిసలై జోగుతున్నారని అన్నారు.తాగుడు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల రమ్య వంటి పసిమొగ్గలు చిదిమివేయబడుతున్నారని, సమాజం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని లక్ష్మణ్ అన్నారు. యువత , మహిళలను, మేధావులను, శ్రామికులను , అన్ని వర్గాల వారిని ఈ సాంఘిక దురాచార నిర్నూలనోద్యమానికి మద్దతు ఇవ్వాలని లక్ష్మణ్ కోరారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం న్యూజెర్సీలో నిర్వహించినట్టు యుఎస్‌ఎ యూత్ కో కన్వీనర్ జంబుల విలాస్ చెప్పారు. బిజెపి జాతీయ కార్యదర్శి ఆర్ పి సింగ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.