తెలంగాణ

ఎటూ తేలని ‘న్యాయ విద్య’ ఫీజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణలో న్యాయ విద్యా కళాశాలల్లో మూడేళ్ల యుజి, రెండేళ్ల పిజి, ఐదేళ్ల యుజి కోర్సుల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తికావస్తున్నా, కాలేజీల్లో సీట్లు, ఫీజుల వ్యవహారాన్ని ప్రభుత్వం తేల్చలేదు. రాష్టవ్య్రాప్తంగా 22 కాలేజీలకు తాత్కాలికంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వీటిలో సీట్ల వ్యవహారం కూడా నిర్దిష్టంగా తేలలేదు. నాలుగు ప్రభుత్వ లా కాలేజీలతో పాటు రెండు మైనార్టీ కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే న్యాయ విద్యాకళాశాలల రెన్యూవల్ జాబితాలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అందకపోవడంతో న్యాయ విద్యాకళాశాల్లో అడ్మిషన్ల వ్యవహారంలో తీవ్రమైన జాప్యం జరిగింది. బిసిఐ నుండి జాబితా రాగానే వారం రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి సర్ట్ఫికేట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్లను పూర్తి చేశారు. 29వ తేదీ నుండి రెండో తేదీ వరకూ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. మూడేళ్ల ఎల్‌ఎల్‌బికి 9897 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బికి 2811 మంది, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సునకు 1620 మంది అర్హత సాధించారు. వెబ్ ఆప్షన్లకు సైతం ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటతో గడువు పూర్తవుతున్నా, న్యాయవిద్యా కళాశాలలపైనా , సీట్ల సంఖ్యపైనా, ఫీజులపైనా ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. బిసిఐ ఈ ఏడాదికి మాత్రం అభ్యర్థుల వయోపరిమితి నిబంధనలను సడలించింది. వచ్చే ఏడాది నుండి 30 ఏళ్లలోపు వారిని మాత్రమే ఎల్‌ఎల్‌బి కోర్సులో అనుమతించాలని బార్ కౌన్సిల్ ఇప్పటికే నిర్ణయించడంతో ఎల్‌ఎల్‌బిలో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కన్వీనర్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు 9600 రూపాయలు, బి కేటగిరిలో యాజమాన్య కోటా కింద చేరిన వారికి గరిష్టంగా 32వేల రూపాయలు ఫీజుగా గత ఏడాది ఖరారు చేశారు. ఈ ఏడాది ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు ఇంకా జారీ చేయలేదు. అయితే ఈసారి ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని కొన్ని కాలేజీలు లక్ష రూపాయల వరకూ ఫీజును వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే ఎంఎల్ కోర్సునకు కన్వీనర్ కోటాలో- 21,600 రూపాయలు, బి కేటగిరిలో 33800 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు అడ్మిషన్, రిజిస్ట్రేషన్, రికగ్నేషన్ ఫీజు వెయ్యి రూపాయలు, స్టూడెంట్ స్పెషల్ సర్వీసెస్ కోసం వెయ్యి రూపాయలు ఏటా చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా లైబ్రరీ డిపాజిట్ ఫీజు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా ఇదే ఫీజులను కొనసాగిస్తారా లేక ఫీజుల్లో మార్పు చేస్తారా అనే అంశంపై ఇంత వరకూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఒక పక్క సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో కూడా ఇందుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. ఉన్నత విద్యా మండలి లా అడ్మిషన్లకు రూపొందించిన వెబ్‌సైట్‌లోనూ ఫీజు వివరాలు స్పష్టం చేయలేదు. వర్శిటీ కాలేజీల్లోనూ వ్యత్యాసం
ఉస్మానియా యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లా లో ఫీజు 2900 రూపాయలు కాగా, వరంగల్ కాకతీయ లా కాలేజీలో 6240 రూపాయలుగా నిర్ణయించారు. అదే తెలంగాణ యూనివర్శిటీలో ఫీజు 13,000 రూపాయలు ఖరారు చేశారు. సుల్తాన్ ఉలూం వంటి కాలేజీల్లో న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఫీజు మూడేళ్ల కోర్సునకు పాతిక వేలుగా నిర్ణయించారు. మిగిలిన కాలేజీల్లో ఫీజులు తేలాల్సి ఉంది. కాగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఉస్మానియా పిజి కాలేజీ ఆఫ్ లాలో ఐదేళ్ల కోర్సునకు 9935 రూపాయలు ఖరారు చేశారు.