తెలంగాణ

హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: జంటనగరాల పరిధిలో సిసి కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమానికి నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు నగర కమిషనర్ కార్యాలయంలో గురువారం ఎన్‌ఎండిసి డైరెక్టర్ సందీప్ తుల, నగర అదనపు కమిషనర్ మురళీకృష్ణ కలసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సమక్షంలో మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంవోయు)పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎండిసి డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా చారిత్రక కట్టడాలు, ప్రదేశాల సంరక్షణ ఉంటుందని, నగర ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుకు ఎన్‌ఎండిసి రూ. 1.5 కోట్లు వెచ్చించనున్నట్టు డైరెక్టర్ సందీప్ తెలిపారు. నగర భద్రత, ప్రజల రక్షణకు పోలీసులు చేపట్టిన ఈ వినూత్న పథకం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. నగరవ్యాప్తంగా సిసి కెమెరాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు.

చిత్రం.. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ సమక్షంలో సిసి కెమెరాల ఏర్పాటుపై ఎన్‌ఎండిసితో ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం