తెలంగాణ

పార్టీ బలోపేతం కోసమే ఉత్తమ్ గడ్డం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరని, సన్యాసులు అవుతారంటూ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి మండిపడింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కెటిఆర్ అహంకారానికి, అధికార మూర్ఖత్వానికి నిదర్శనమని టిపిసిసి సీనియర్ నేత మల్లురవి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు పి రమేష్, నగేష్ ముదిరాజ్‌తో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ, పార్టీని పటిష్టం చేయాలన్న సంకల్పంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం పెంచుకుంటున్నారన్నారు.
కెసిఆర్ ప్రజాధనంతో మొక్కులు చెల్లించుకున్నారని, ఇప్పటికే తిరుపతి, విజయవాడ, వరంగల్ దేవుళ్ల కోసం పదికోట్ల రూపాయలు వెచ్చించారన్నారు. టిపిసిసి ప్రజాధనం దుర్వినియోగం చేయడం లేదని, తన గడ్డం మాత్రమే పెంచుకుంటున్నారన్నారు. అవినీతి జరిగితే తన కుటుంబ సభ్యులను సైతం సహించేది లేదని గొప్పలు చెప్పిన కెసిఆర్ ఇప్పుడు గ్రేటర్‌లో రూ. 300 కోట్ల అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజులు, ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నారన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని వారు మంత్రులకు హితవు పలికారు.