తెలంగాణ

మావోల బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు నిరశనగా ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టులు తలపెట్టిన బంద్ గురువారం ప్రశాంతంగా సాగింది. మావోల బంద్ పిలుపుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్టల్ల్రో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఏవోబిలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఏజెన్సీల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. నాకాబందీ, వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించవద్దని పోలీసుల సూచనతో వారంతా రాజధానికి చేరుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు మినహా అన్ని పట్టణ, జిల్లా కేంద్రాల్లో ఆర్టీసి బస్సులు యథావిధిగా నడిచాయి. పోలీసులు మాజీ మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీసులు చేపట్టిన గట్టి బందోబస్తు చర్యలతో తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో ప్రజలు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.