తెలంగాణ

రాహుల్ అరెస్టు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, కేంద్రం అమలు చేస్తున్న నిర్బంధ కాండకు నిదర్శనమని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క అన్నారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య కాదని, కేంద్రం, ప్రధాన మంత్రి చేసిన హత్యగా ఆయన పేర్కొన్నారు. మరణించిన మాజీ సైనికుడిపై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. రాహుల్ గాంధీకి దేశం అండగా నిలబడుతుందన్నారు.