తెలంగాణ

సచివాలయ తరలింపు తెలివితక్కువ పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొలువు తీరిన సచివాలయాన్ని కూల్చివేసి తాత్కాలికంగా వేరే చోటకు తరలించి కొత్త భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సచివాలయాన్ని తరలించడం తెలివితక్కువ నిర్ణయమన్నారు. కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయల వ్యయమవుతుందని, ఈ భారాన్ని ప్రజలపైన మోపడం తగదన్నారు. 2008లో హెచ్ దక్షిణ, ఉత్తర బ్లాక్‌లను నిర్మించారన్నారు. ఈ భవనాలు అన్ని రకాలుగా బాగున్నాయన్నారు. 2003లో డి బ్లాక్‌ను నిర్మించారన్నారు. 1998లో ఏ బ్లాక్‌ను, జె బ్లాక్‌ను 1990లో ఎల్ బ్లాక్‌ను 1981లో, సి, బి బ్లాక్‌లను 1978లో, కె బ్లాక్‌ను 1975లో నిర్మించారన్నారు. సచివాలయం మొత్తం మీద పాత బ్లాక్ జీ బ్లాక్ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. వాస్తు కారణాలను చూపెట్టి సచివాలయం భవనాలను కూల్చాలనుకోవడం తగదన్నారు. దశాబ్దాలుగా ఈ భవనాలు సచివాలయం అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడుతున్నాయన్నా రు. కొత్త భవనాలను నిర్మించాలంటే రూ.350 కోట్ల నిధులు కావాలన్నారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించిన అంశంలో అగ్నిమాపక నిబంధనలకు లోబడి సచివాలయ భవనాలు లేవని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఇటీవలి కాలం వరకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదే సచివాలయం కేంద్రంగా పనిచేశారన్నారు. వారికి జడ్ ప్లస్ భద్రత కూడా ఉందన్నారు. గతంలో ఎన్టీరామారావు, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఇదే సచివాలయం నుంచి బాధ్యతలను నిర్వహించారన్నారు. ఏపి ప్రభుత్వం ఇక్కడ సచివాలయాన్ని అమరావతికి తరలించడంతో ఎక్కువ వసతి సదుపాయాలు తెలంగాణకు సమకూరనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని బయటకు తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలను ఇప్పుడున్న సచివాలయంలోకి మార్చవచ్చన్నారు. దీనివల్ల ప్రజలపై భారం పడదన్నారు. రైతులకు రుణమాఫీ నిధులు విడుదల చేయలేదు, విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు ఇవ్వలేదు. సంక్షేమ రంగాన్ని విస్మరించి అనవసరంగా భవనాల నిర్మాణానికి నిధులు ఖర్చుపెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. కెసిఆర్ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాలన్నారు. విపక్షాలు, తెలంగాణ సమాజం, ప్రజా సంఘాల మనోభావాలను గౌరవించాలన్నారు.