తెలంగాణ

బస్టాండ్లలో ప్రయాణికులకు శుద్ధిచేసిన మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసి ప్రయాణీకులకు శుభవార్త. బస్టాండ్లలో శుద్ధమైన మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక ఖరారు చేసిన ఆర్టీసి, ప్రయాణికులకు బిస్లరీ మినరల్ వాటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకాన్ని వచ్చే నెల నుంచి ఈ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని 360 బస్టాండ్లలో ప్రయాణికులకు లీటర్, అర లీటర్ వాటర్ బాటిళ్లు సరసమైన ధరలకే అందుబాటులో వస్తాయి. 20 లీటర్ల వరకు మంచినీరు లూజ్‌గా విక్రయించే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మంచినీటిని విక్రయించేందుకు ఆర్టీసి బస్టాండ్లలో షాపులు ఆర్టీసి నుంచి లైసెన్సును తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకులకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఈస్కీంను అమలు చేయాలనుకుంటున్నట్లు ఆర్టీసి జెఎండి రమణారావు చెప్పారు. స్ధానికంగా ఉండే ఏజన్సీల నుంచి రక్షిత మంచినీటి సరఫరా కోసం టెండర్లను ఆహ్వానిస్తారు.