తెలంగాణ

నకిలీ విత్తనాల పరిహారానికి కొత్త చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందిస్తోందని వ్యవసాయ అనుబంధ శాఖ కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు. ప్రత్యేక చట్టం రూపొందించేందుకు పార్థసారిధి సచివాలయంలో శుక్రవారం తన చాంబర్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. హరిత విప్లవంతో వివిధ పంటల్లో హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తి, వినియోగం పెరిగిందని, విత్తన కంపెనీలు జన్యు మార్పిడి చేసిన విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చారని తెలిపారు. రైతులు హెబ్రిడ్ విత్తనాలపై మొగ్గు చూపడంతో ప్రతి సంవత్సరం విత్తనాల కోసం విత్తన ఉత్పత్తి కంపెనీలను ఆశ్రయిస్తున్నారని, దీనితో విత్తనాల నాణ్యత, జన్యు స్వచ్ఛత వివిధ లోపాల వల్ల పంట నష్టం రైతులను దెబ్బతీస్తోందని తెలిపారు. నాణ్యత లేని విత్తనాల ద్వారా రైతులు పంట నష్టపోయినప్పుడు బాధ్యత తీసుకోవడం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు పకడ్బందీగా, లోసుగులు లేని నూతన చట్టాన్ని తీసుకుని రావాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. మరో మూడు రోజుల్లో ఈ చట్టం రూపకల్పన పూర్తవుతుందని, న్యాయశాఖ అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు.