తెలంగాణ

ఫీజు బకాయిలు మీ హయాంలోనివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కాంగ్రెస్ కాలం నాటివేనని, దీనిపై కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడం తగదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కాలేజీ యాజమాన్యాల సమస్య అని, విద్యార్థుల సమస్య అయినట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఫీజు బకాయిలు ఉండేవని, వాటిని రెండు వేల కోట్లకు తీసుకు వచ్చినట్టు చెప్పారు. ఇటీవల మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. కేంద్రం రుణ పరిమిత చట్టంలో తెచ్చిన వెసులుబాటు వల్ల 3500 కోట్ల రూపాయల రుణం రాష్ట్రానికి రాబోతుందని , అందులో రెండువేల కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీకి కేటాయించనున్నట్టు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతోందని అన్నారు. దీనిలో భాగంగానే కొత్త భవనాల నిర్మాణం అని అన్నారు. కెసిఆర్ తన సొంతానికి క్యాంపు కార్యాలయం కట్టడం లేదనే సంగతిని ప్రతిపక్షాలు గ్రహించాలని చెప్పారు. ప్రజలు ఎన్నిసార్లు కర్రు కాల్చి వాతలు పెట్టేలా తీర్పులు ఇచ్చినా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదని అన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంకో 20 ఏళ్లయినా గడ్డం తీయాల్సిన అవసరం పడదని, ఆయన అలా పెంచుకుంటూ పోవాలని ఎద్దేవా చేశారు.