తెలంగాణ

సచివాలయాన్ని కూల్చొద్దు : చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: సచివాలయం కూల్చి వేత, కార్యాలయాల తరలింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు చెల్లించకుండా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపట్టకుండా సచివాలయంలోని భవనాలను కూల్చి వేసి, 380 కోట్ల రూపాయలతో కొత్తగా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏముందని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. పైగా వీటి గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నట్లు ప్రచారం చేయడం భావ్యం కాదని ఆయన తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.