తెలంగాణ

సంక్షోభంలో ఉల్లి రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4:గత సంవత్సరం ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగ దారులకు ఇబ్బంది కలిగితే ఇప్పుడు ధరలు గణనీయంగా పడిపోయి రైతులను సంక్షోభంలో పడేసింది. ఈ పరిస్థితుల్లో ఉల్లి రైతులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలని కోరుతూ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉల్లి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఉల్లి పండించే రైతులను ఆదుకోవడానికి సహకరించాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. అధికోత్పత్తి వంటి పలు కారణాల వల్ల ఉల్లి పండించే రైతులు సంక్షోభంలో పడ్డారని, వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు అనూహ్యంగా పతనమైనందున తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకొని వారికి మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల్లో లక్షా 35వేల 202 క్వింటాళ్ల ఉల్లిని క్వింటాలు 800 రూపాయల చొప్పున 10 కోట్ల 81లక్షల 62వేల రూపాయలతో తెలంగాణ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణకు అవసరమైన 53వేల టన్నుల ఉల్లి సేకరణకు కేంద్రం సహకరించాలని హరీశ్‌రావు కోరారు. కిలో ఎనిమిది రూపాయల చొప్పున కొనుగోలుకు తమ ప్రభుత్వం సిద్ధమైందని, అయితే ఇందులో 50 శాతాన్ని భరించడానికి ముందుకు రావాలని మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఆగస్టు- నవంబర్‌లో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఉల్లి ధరలు అకాశాన్నంటిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. రైతుల నుంచి దాదాపు 50 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు 20 రూపాయలకు అందేట్టు చేశామని మంత్రి తెలిపారు. ధరల స్థిరీకరణకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు. ఉల్లి రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు 75 శాతం సబ్సిడీ రూపంలో విత్తనాలు సరఫరా చేశామని మంత్రి వివరించారు. ఈసారి మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి ఊహించని స్థాయిలో పెరగడంతో ధరలు కుప్పకూలాయని హరీశ్‌రావు తెలిపారు. దీంతో కొత్త రాష్ట్రం అయినా రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కిలో ఎనిమిది రూపాయలతో నేరుగా రైతుల నుంచి ఉల్లి సేకరణకు నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్‌రావు కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కూడా ఉల్లి పంట దెబ్బతిని రైతులు నష్టపోయారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.