తెలంగాణ

అంతర్జాతీయ ప్రమాణాలతో అటవీ కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, నవంబర్ 4: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ప్రాంతంలో అటవీ కళాశాల, రీసెర్చ్ సెంటర్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్‌ఎం డోబ్రియాల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఫారెస్ట్ కళాశాల కోయంబత్తూర్ మేట్టుపాలెం వద్ద ఉండగా, రెండవ కళాశాలను తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో నిర్మించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా కళాశాలలను నిర్మించి సిఎం కలలను సాకారం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అమెరికా అలబామా రాష్ట్రంలోని అబర్నా విశ్వవిద్యాలయంతో పరస్పరం అవగాహన, ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. ఈ కళాశాలలో అటవీ శాస్త్రంలో బిఎస్సీ 4 సంవత్సరాల కోర్సు, ఎమ్మెస్సీ రెండు సంవత్సరాల కోర్సు, రీసెర్చ్ 3 సంవత్సరాల కోర్సు నిర్వహిస్తున్నామన్నారు. కాగా బిఎస్‌సిలో 50 సీట్లు, ఎమ్మెస్సీలో 36సీట్లు, పిహెచ్‌డిలో 18 సీట్ల చొప్పున కేటాయించినట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్‌సిఆర్‌ఐ బిఎస్సీ అటవీ శాస్త్రంలో 31 మంది బాలికలు, 19 మంది బాలురులను 4 సంవత్సరాల కోర్సుకు తీసుకున్నట్లు ఆయన చెబుతూ ఈ భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు ప్రస్తుతం మొదటి సంవత్సరం విద్యను హైదరాబాద్‌లోని దూలపల్లిలో తరగతులను ప్రారంభించామన్నారు. ఈ కోర్సుల ఎంపికకు వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రాలలో పొందిన మార్కుల ప్రమాణంగా తీసుకొని, మెరిట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేసినట్లు చెప్పారు. బిఎస్సీ అటవీ శాస్త్రం చదివిన విద్యార్ధులకు ఐఎస్‌ఎఫ్ అధికారులుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, జమ్ము-కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో బిఎస్సీ అటవీ శాఖ చదివిన విద్యార్ధులకు అటవీ శాఖ చేపట్టే ఎఫ్‌ఆర్‌ఒ, ఎసిఎఫ్ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తుండగా ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుత సంవత్సరం విద్యార్దుల బోధన కోసం ప్రొఫెసర్‌లు, డాక్టరేట్‌లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించగా వచ్చే సంవత్సరం పూర్తి స్థాయి సిబ్బందిని టిఎస్‌పిఎస్ ద్వారా ఎంపిక చేసి నియమిస్తామని తెలిపారు.

చిత్రం.. మొదటి సంవత్సరం విద్యార్థులతో ఫారెస్ట్ అధికారులు