తెలంగాణ

నిఖిల్‌రెడ్డికి చికిత్స నిలిపివేసిన వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/జీడిమెట్ల, నవంబర్ 6: ఎత్తు పెంచేందుకు శస్తచ్రికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డి కాళ్లకు ఇనె్ఫక్షన్ అయింది. సరైన వైద్యం అందించక పోవడమే కాకుండా వైద్య నిలిపివేయడంతోనే నిఖిల్‌రెడ్డి కాళ్లకు ఇనె్ఫక్షన్ అయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రెండు కాళ్లకు చేసిన శస్త్ర చికిత్సతో నిఖిల్ రెడ్డి మానసికంగా కుంగిపోయాడని, ఇప్పుడు వైద్యం నిలిపివేయడంతో మరింత మానసిక క్షోభకు గురై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోనంటూ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కూకట్‌పల్లికి చెందిన నిఖిల్‌రెడ్డి తన ఎత్తు పెంచుకునేందుకు గత ఏప్రిల్‌లో తన తల్లిదండ్రులకు తెలియకుండా వైద్యుల మాటలు విని రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ శస్త్ర చికిత్స వికటించటంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ ఆపరేషన్ ద్వారా నిఖిల్‌రెడ్డి ఎత్తు పెరగకపోవడమే కాకుండా, రెండు కాళ్లు చచ్చుబడిపోయాయని, తమ అనుమతి లేకుండా ఆపరేషన్ ఎలా చేశారంటూ కుటుంబీకులు గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మోసపూరితంగా శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్, ఆసుపత్రి సిఇవో శివాజీ చటోపాధ్యాయపై చర్య తీసుకోవాలంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన మెడికల్ కౌన్సిల్ వారిని సస్పెండ్ చేసింది. నిఖిల్‌కు పూర్తి వైద్యం అందిస్తానన్న ఆసుపత్రి యాజమాన్యం అతనికి వైద్యం నిలిపివేసింది. దీంతో నిఖిల్‌రెడ్డికి కాళ్లకు ఇనె్ఫక్షన్ పెరిగిపోయిందని వారు ఆరోపించారు. ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తమ కొడుకు నిఖిల్‌రెడ్డికి సరైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వైద్యం అందించకపోతే ధర్నా చేస్తా: గోవర్ధన్‌రెడ్డి
నిఖిల్‌రెడ్డికి పూర్తిస్థాయిలో వైద్యం అందించకపోతే వేలాదిమందితో గ్లోబల్ ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తానని నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం హెచ్చరించారు. గ్లోబల్ ఆసుపత్రి మోసపూరిత నిర్వాకంతో తన కుమారుడు నిఖిల్‌రెడ్డి మంచాన పడ్డాడని, ఆసుపత్రి వైద్యులను సస్పెండ్ చేసి పూర్తిస్థాయిలో నిఖిల్‌రెడ్డికి వైద్య చికిత్సలు అందించాలన్నారు. పదిరోజులుగా ఒక్క డాక్టర్ కూడా రాకుండా వైద్యం నిలిపివేశారని, వెంటనే వైద్యం అందించాలని లేనిపక్షంలో వేలాదిమందితో ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తానని గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.